అలనాటి ‘మంచి ప’ర్యాటక కేంద్రం
- -ద్యావనపల్లి సత్యనారాయణ in Sunday Andhrabhoomi, 06/05/2012.
ఎకో టూరిజం అనే భావనను మనం ఈ మధ్య కనిపెట్టాం అని
అనుకుంటున్నాం. కాని కొద్ది తేడాలతో వందల ఏళ్ల
కిందటే ఎకో-టూరిజాన్ని ఎంజాయ్ చేసిన రాజులు, రాజన్యులు ఎందరో ఉన్నారు. ప్రత్యేకించి నిజాం రాజుల గురించి
చెప్పుకోవాలి. వారు, వారి బంధువులు, అధికారులు
తమ రాజ్యం (తెలంగాణ)లో ఉన్న ఎన్నో అడవులను వేట పర్యాటక కేంద్రాలుగా మలచుకున్నారు. అలాంటి ‘షికార్‌ఘర్’ (వేట కేంద్రం) ఒకటి నిజామాబాద్‌కు 18
కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని పేరు మంచిప్ప. ఇది హైదరాబాద్ - నిజామాబాద్ రహదారి మీద సుమారు 130 కి.మీ.లు ప్రయాణించిన తరువాత వచ్చే దగ్గి నుండి ఎడమ వైపు 20 కి.మీ.
ప్రయాణించిన తరువాత వస్తుంది. నిజాంల కాలంలో
నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక పర్యాటక కేంద్రంగా గుర్తింపబడిన ఈ మంచిప్ప ఇప్పుడెలా ఉందో చూద్దాం.
అలరించే అటవీ ప్రయాణం..
దగ్గి నుంచి ఉత్తనూర్ మీదుగా 7 కి.మీ.లు ప్రయాణించిన తరువాత వచ్చే ‘గంటావారి పల్లె’ నుంచి అటవీ ప్రయాణం ప్రారంభమవుతుంది. సమతలం నుంచి క్రమంగా పీఠభూమి నెక్కడం, ఆ తరువాత కొండల వరుసలు, అడవుల పచ్చని చెట్ల మధ్యగుండా ప్రయాణించడం మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ 13 కి.మీ.ల అటవీ ప్రయాణంలో ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తాయి. కొండలకు నిలువుగా చెక్కినట్లున్న అంచుల వద్ద కట్టుకున్న గిరిజన గూడెలు, గిరిజనుల వేష భూషాదులు, వారి వ్యవసాయ కార్యకలాపాలను చూస్తూంటే మన ప్రక్కనే ఉంటూ మనకంటే ఎంత వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది. అయినా ఎంత సహజంగా ఉన్నారు అనే విషయాలు ఆలోచింపజేస్తాయి. వారితో మాట్లాడితే మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
కొండల లోయల్లో నుంచి పారుతున్న సెలయేరుల గలగలలు, వాటి స్వచ్ఛత ఏ మినరల్ వాటర్‌తో పోల్చగలం. తాగితేనే తెలుస్తుంది వాటి మాధుర్యం. సెలయేళ్ల ప్రవాహంలో దిగి ఆ నీళ్లతో సరసాలాడాలనిపిస్తుంది. దుముకాలనిపిస్తుంది. అసలు రెండు పచ్చని కొండల మధ్య తెల్లగా నురగలు కక్కుకుంటూ పారే సెలయేళ్లు అందమే నయనానందకరం. మళ్లీ సెలయేళ్ల ప్రవాహం ఒడ్డు ఎక్కడం, ఒక సాహసం. మళ్లీ లోయలు, మళ్లీ కొండలు, మలుపులు, ఎత్తుపల్లాలు, ఇలా సాగుతుంది ప్రయాణం. అల్లంత దూరాన తెల్లని ఆవుల మందలు, పచ్చని చేల మధ్య పచ్చిక మేస్తున్న నల్లని బర్రెలు, గొర్రెలు, మేకలు.. ఇవన్నీ చూస్తే ఎంత సహజ సౌందర్యాన్ని మిస్సవుతున్నామో అర్థమవుతుంది.
గాంధారి అడవులుగా పేరుగాంచిన ఈ అడవుల్లో దట్టమైన అడవి ప్రారంభమయ్యే ప్రాంతం ఒక సుందర దృశ్యం. ఇక్కడ సడన్‌గా ఒక గుట్ట అడ్డమొచ్చి, ప్రయాణాన్ని అడ్డుకుంటుంది. దానివల్ల ఆ గుట్టను రెండుగా చీల్చవలసి వచ్చింది. ఎల్ ఆకారంలో ఇరుకైన ఆ గండి మధ్య నుంచి మెల్లగా ప్రయాణించి పచ్చని చిక్కని అడవుల్లోకి అడుగిడటం అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది. కొండలపై నుంచి వచ్చే సెలయేళ్లకు అడ్డంగా ఆనకట్టలు కట్టి చిన్నచిన్న చెరువులు కట్టుకుని వాటి కింద సాగుచేస్తున్న చేలు, తెల్లని చెరువుల కింద పచ్చని చేలు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో భూమిపై ప్రసరించే అరుణారుణ వర్ణాలు.. ఇలా ఎన్ని రంగుల కలలనో సాకారం చేసుకోవచ్చు. ఇరుపక్కలా విస్తరించిన పచ్చని ఎతె్తైన చెట్ల మధ్య నల్లని పాపిటలాగా సాగే సింగిల్ బ్లాక్‌టాప్ రోడ్డు మీద స్వచ్ఛమైన గాలులను ఆస్వాదిస్తూ ప్రయాణించడం అలరిస్తుంది.
ముస్లిం రాజుల కట్టడాలు
ఇలా ప్రయాణించిన తరువాత మొదటిగా కనిపించేది నిజాం గెస్ట్‌హౌస్. ఇది మంచిప్ప చెరువు ఈశాన్యం గట్టు మీద నిర్మించబడింది. ఇదొక పెద్ద భవంతి. ముస్లిం వాస్తు శైలికి మచ్చుతునక. ఇందులో ముందు హాలు, మధ్య హాలు, వెనుక (చెరువు వైపు) కిచెన్ ఉన్నాయి. అయితే ఈ కట్టడంలో వాడిన ఇటుకల పరిమాణం తొమ్మిది న ఏడు న రెండు అంగుళాలు కావడంతో ఇవి గోల్కొండ కుతుబ్‌షాహీల కాలంలో వాడుకలో ఉండేవి కాబట్టి ఈ గెస్ట్‌హౌస్‌ను ఏ నాలుగు వందల సంవత్సరాల కిందనో కట్టారని చెప్పవచ్చు. నిజాంల కాలంలో (18, 19 శతాబ్దాలు) మరమ్మతులు జరిగినట్లు చెప్పడానికి నిదర్శనంగా చిన్న ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి. ఈ గెస్ట్‌హౌస్‌కు కొంచెం దూరంలో దక్షిణాన పెద్ద మసీదుల సముదాయం ఉంది. గెస్ట్‌హౌస్, మసీదుల మధ్య మూడు వైపులా పిట్టగోడలు ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న మూడు గద్దెలు నిర్మించబడ్డాయి. ఆ గద్దెలు ముస్లిం సమాధులా అనే అనుమానం కూడా వస్తుంది. ఏమైనా ఈ మూడు నిర్మాణాలూ గెస్ట్‌హౌస్, మసీదులు, గద్దెలు మంచిప్ప చెరువుకు ఎదురుగా దాని ఒడ్డునే నిర్మించబడ్డాయి. కాబట్టి ఆనాటి ముస్లిం రాజన్యులు, ధనికులు వీటిల్లో కూర్చుని చెరువుపై నుంచి వచ్చే చల్లగాల్లుల్ని ఆస్వాదించేవారని చెప్పవచ్చు.
షికార్లు..
నిజాంలు, వారి అధికారులు మంచిప్పకు రావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఇది ఎతె్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి ఈ ప్రదేశం సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఇది రెండవ ఎతె్తైన ప్రదేశం. ఇక్కడికి 7 కి.మీ.ల దూరంలో ఉన్న చద్మల్ పీఠభూమి (కొండల పైభాగం) నుండి వాగులు పుట్టి ఈ మంచిప్ప చెరువు వరకు ప్రవహిస్తాయి. కాబట్టి ఈ ప్రాంతం ఎతె్తైన కొండలు, పచ్చని అడవులు, గలగల పారే సెలయేళ్లతో కూడి చల్లగా ఉంటుంది. పర్యాటకులను అలరిస్తుంది. ఇక రెండవ కారణం ఇక్కడి అడవులు అనేక జీవ జంతువులకు ఆవాసాలు కావడంతో వేటాడటానికి రాజన్యులకు అవకాశముండేది. పొద్దంతా వేటాడి సాయంత్రం ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో వండించుకుని, వడ్డించుకొని తింటూ తాగుతూ ఎంజాయ్ చేసేవారని ఈ ప్రాంత పెద్దలు చెప్తారు. ఇక్కడి చెరువు కూడా పెద్దది కాబట్టి ఇందులోకి ‘పుట్టి’లలో వెళ్లి చేపలను పట్టుకొని వేయించుకొని తినేవారట.
మంచిప్ప చెరువుకు అన్ని పక్కలా పచ్చని గుట్టలున్నాయి. ఒక తూర్పు - ఈశాన్యం తప్ప. అదొక సుందర దృశ్యం. వాయవ్యం, ఈశాన్యం కొండల మధ్య సుమారు కిలోమీటరున్నర దూరం ఉంటుంది.
ఈ మధ్య దూరంలో కట్టిన ఆనకట్ట మీద చెరువులో చేపలు పట్టుకుంటున్న పక్షులను చూస్తూ, చెరువు కింద పచ్చని పొలాలను చూస్తూ నడిచే ట్రెక్కింగ్ చక్కని అనుభూతి నిస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ పట్టణానికి ఈ చెరువు నీరే ఆధారం.
ఇక్కడి దేవాలయాలెప్పటివో?
నిజాం గెస్ట్‌హౌస్ వెనుక చెరువు తూము దగ్గర రెండు గుండ్ల మధ్యలోని గుహలో ఒక దేవాలయం, దీనికి ఉత్తరాన 50 మీటర్ల దూరంలో మరో దేవాలయం ఉంది. మొదటి దేవాలయం ఎప్పటిదో చెప్పటానికి వీలులేకుండా ఉంది. ఇటీవల కట్టిన దాని గోడలు, పై కప్పు దాని ప్రాచీనతను కప్పిపుచ్చుతున్నాయి. కాని అది మధ్యయుగాల నాటిదని చెప్పడానికి నిదర్శనంగా దాని ఆగ్నేయంలో ఆనాటి చెక్కిన స్తంభం ఒకటి ఉంది. ఇక రెండవ దేవాలయం అత్యంత ప్రాచీనమైనదిగా తోస్తుంది. శివలింగం, గణపతి, హనుమంతుడు, నాగిని శిల్పాలు, వాటి ముందరి చక్రం, శిల్పం - అన్నీ చాలా ప్రాచీనమైనవిగా తోస్తున్నాయి. ఈ ఆలయం చుట్టూ చాలా పొడవు, వెడల్పులతో ఉన్న అతి ప్రాచీన ఇటుకలతో ప్లాట్‌ఫామ్ నిర్మించబడి ఉంది. గెస్ట్‌హౌస్ ముందు కూడా ఒక స్థూపాకార గొట్టం పడి ఉంది.
చేయవలసినవి
ఇవన్నీ ఎప్పటివి? వీటిని ఎవరు ఏ కాలంలో కట్టించారు? ఆయా కాలాల్లో వీటి ప్రాధాన్యం ఎలా ఉండేది మొదలైన విషయాలను పరిశోధించవలసి ఉంది. గెస్ట్‌హౌస్‌కు దక్షిణాన పిట్టగోడల మధ్యనున్న గద్దెల వంటి నిర్మాణాలను, వాటి ముందర పది మీటర్ల వరకు విస్తరించిన కట్టడాల బేస్‌మెంట్లు కనిపిస్తున్నాయి కాబట్టి అవి చెరువు మీది నుంచి పిల్లగాలులను ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించిన కట్టడాలైతే వాటిని పునరుద్ధరిస్తే అంత ప్రాచీనమైన నిర్మాణాల్లో ఆనందిస్తున్నామని పర్యాటకులు గర్వపడతారు. అలాగే గెస్ట్‌హౌస్‌ను కూడా అతి కొద్ది ఖర్చుతో ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తేవచ్చు. మసీదులు, గెస్ట్‌హౌస్ మధ్యనున్న ఎత్తుపల్లాల ఖాళీ స్థలంలో పార్క్‌ను ఏర్పాటు చేయవచ్చు. పార్కు నానుకొని బోటింగ్ సౌకర్యాన్ని, ఏంజ్‌లింగ్, నీళ్లపై నడిచే బెలూన్ తదితర వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను ఏర్పాటుచేస్తే సమీప నిజామాబాద్ పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల ప్రజలకు కూడా ఒక మంచి పర్యాటక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది. ఈ ప్రాంతంలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ కాబట్టి వారు సేకరించే అటవీ ఉత్పత్తులు, వారు చేత్తో చేసే చేతి ఉత్పత్తులను (హస్తకళలు) వారు ఇటీవల ఇక్కడ కట్టుకున్న భీమన్న దేవాలయం దగ్గర మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే అటువారికి, ఇటు పర్యాటకులకు లాభం కలుగుతుంది.

No comments:
Post a Comment