Monday 9 April 2012

The travelogue on GUNDAALA, the Highest Waterfalls in AP discovered and published in Andhrabhoomi on 8-4-2012

నట్టడవి నడుమ గుండాల జలపాతం
                                                                     
ఏ కొద్దిగా పర్యాటక పరిజ్ఞానం ఉన్నవారినైనా మన రాష్ట్రంలో అతి పెద్ద వాటర్ ఫాల్స్ ఏది?’ అని అడిగితే వారు ఇంతవరకు చెప్తున్న సమాధానం కుంటల వాటర్‌ఫాల్స్’. మనం ఇక మీదట మన సమాధానాన్ని మార్చుకొని గుండాల వాటర్ ఫాల్స్అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే, కుంటల వాటర్‌ఫాల్స్ ఎత్తు 46 మీటర్లు కాగా గుండాల వాటర్ ఫాల్స్ ఎత్తు ఇంక వంద మీటర్లు ఎక్కువగా ఉంటుంది. అంటే కుంటల వాటర్ ఫాల్స్ కంటే గుండాల కూడా కుంటల వాటర్ ఫాల్స్ ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనే తిర్యాని మండలం మాన్కాపూర్ గ్రామ పరిధిలో ఉంది.
గుండాలకు వెళ్లటం ఒక సాహసం. ఇది ఎతె్తైన సత్మల పర్వత సానువులను ఎక్కాక నట్టనడిమి అడవిలో ఉంది. ఇక్కడికి రోడ్లుండవు. కాలినడకే శరణ్యం. కవ్వాల అభయారణ్యంలో భాగమైన ఈ గుండాలకు అటవీ మార్గంలో ఎలా పోవాలో కూడా తెలియదు కాబట్టి గుండాల మాజీ ఎపీటీసీ మోతేరామ్ పటేల్‌ను, సమీప హామ్లెట్ మాజీ ఉపసర్పంచ్ నర్సయ్య పటేల్‌ను తీసుకెళ్లాం.
హైదరాబాద్ నుండి కరీంనగర్, చొప్పదండిల మీదుగా 225 కి.మీ.లు ప్రయాణించాక వచ్చే లక్సెట్టిపేట చౌరస్తా నుండి 16 కి.మీ.ల దూరంలో వచ్చే దండెపల్లి మండల కేంద్రం నుండి ఆటోలో 9 కి.మీ.లు ప్రయాణించి, ఊట్ల అనే నాయకపోడ్ గూడెం చేరుకొని, అక్కడి నుండి 6 కి.మీ.లు ట్రెక్కింగ్ చేసి ఈ గుండాల వాటర్ ఫాల్స్‌ను చేరుకోవచ్చు.
ఊట్ల గుట్టపై మలుపులు.. మజిలీలు
ట్రెక్కింగ్ ప్రారంభంఊట్లఅనే ఏరు నుండి. ఈ ఏటి నీరే సమీప ఊట్ల గ్రామానికి తాగునీటికి, సాగునీటికి ఆధారం. ఈ ఏరు పరిసరాలు ఎతె్తైన పచ్చని, చిక్కని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడున్న అడవి మామిడి వనం స్థానికులకు, పిక్నిక్‌లకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు తియ్యని పళ్లను కూడా అందిస్తాయి ఉచితంగా. సమీపంలోని పెద్దయ్యగుట్ట, భీమన్న దేవర దర్శనాలకు వచ్చేవారు కూడా ఈ ఏరు పరిసరాల్లో సేదదీరుతారు.
ఊట్లలోని సహజమైన, స్వచ్ఛమైన నీటిని బాటిళ్లలో నింపుకుని ఊత్తరం వైపునున్న ఊట్ల గుట్టపైకి ట్రెక్కింగ్ ప్రారంభించాలి. ఈ గుట్ట సుమారుగా 400 మీటర్ల ఎత్తుంటుంది. ఈ ఎత్తును ఏడు మలుపుల్లో ఒక్కో మలుపునకు సుమారు 50 మీటర్ల చొప్పున ఎక్కాలి. ఈ మలుపులను సుమారుగా నిటారుగానే ఎక్కాలి కాబట్టి తప్పకుండా ఆయాసమొస్తుంది. అయితే ఆ అలసటను తొలగించుకోవటానికి మలుపు మలుపు దగ్గర మజిలీలుంటాయి.. అంటే చెట్ల నీడల కింద బండ పరుపులన్నమాట. పచ్చని చెట్ల పైనుండి వీస్తున్న చల్లని గాలులు పర్యాటకులకు ఇచ్చే హాయిని పక్షుల రావాల మధ్య అనుభవించాల్సిందే కాని అభివర్ణించలేం. తడారిన గొంతులను తడుపుకోవడంలో ఉండే తన్మయత్వం కూడా చెప్పలేం.
ఇలా మజిలీ మజిలీలో ఎంజాయ్ చేస్తూ ఏడు మూల మలుపులను ఎక్కిన తరువాత అరె ఇంత ఎత్తు మనమే ఎక్కామా?’ అని ఆశ్చర్యపోతాం. ఈ ఏడు మూల మలుపులకు స్థానిక గిరిజనులు (నాయకపోడ్, రాజ్‌గోండ్) ఏడు పేర్లు పెట్టుకున్నారు. మొదటి మలుపు పేరు తొలి మలుపు, మరో మలుపు పేరు తానిచెట్టు మలుపు, ఇంకొక మలుపు పేరు తేటి మలుపు.. ఇలా. ఈ ఏడు మలుపులను వారు నాన్‌స్టాప్‌గా కేవలం పదిహేను నిమిషాల్లోనే ఎక్కుతారట. ఇది వారికి నిత్యకృత్యం - రోడ్లు లేవు కాబట్టి. సుమారు వందేళ్ల క్రితం సిర్‌పూర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కాగితం మిల్లుకు ఇక్కడి అడవుల నుంచి కంక బొంగు రవాణా అయ్యేదట. ఆ కాలంలో లారీలు తిరగటానికి ఈ గుట్టపై ఏడు మలుపులతో కచ్చా రోడ్‌ను ఏర్పాటు చేశారు. కాని సుమారు యాభై ఏళ్ల కిందట ఇక్కడ బొంగు కొట్టడం ఆగిపోయింది కాబట్టి ఆ కచ్చా రోడ్డు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది. ఐతే గత దశాబ్ద కాలంలో ఇక్కడ పక్కా రోడ్డు వేయడానికి ఒకసారి 4 కోట్లు, మరోసారి 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయట. కాని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఇక్కడి కవ్వాల అభయారణ్యంలో తిరిగే జంతువులకు ఆ రోడ్డు వల్ల హాని కలుగుతుందని అభ్యంతరం తెలిపారని నర్సయ్య పటేల్ చెప్పాడు. ఇక మీదట కూడా ఆ రోడ్డువేసే అవకాశమే లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్ జోన్‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించింది. కాబట్టి కొద్దికాలంలో గుండాల ఊరినే లేపేస్తారట. ఆ ఊరి రాజ్‌గోండులేమో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
అడవి అందాలు
ఆరవ మూల మలుపు ఎక్కిన తరువాత వెనక్కి తిరిగి చూస్తే వావ్అని అరవకుండా ఉండలేం. కారణం అక్కడి నుండి చూస్తే కొండ కోనలు లోయల మధ్య విస్తరించిన పచ్చని చెట్లే కాకుండా వాటి మధ్య పారే ఏరులు కూడా తమ అందాలతో కనువిందు చేస్తాయి. ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దులను నిర్ణయిస్తూ పారుతున్న గోదావరి సోయగాలను తనివితీరా చూడాలనుకుంటే అది ఈ ఆరవ మూల మలుపు నుంచే సాధ్యం. మనం కొండల మీద ఉంటాము కాబట్టి కింద పరచుకున్న విశాల భూభాగంలో పల్లెలు, గిరిజన గూడేలు, వాటి మధ్యనున్న చెరువులు - అన్నీ ఎంతో అందంగా కన్పిస్తాయి.
జన సంచారం లేని ఆ అడవుల్లో జంతు సంచారమైతే ఉంటుందట. పిల్ల తల్లులైన ఎలుగుబంట్లు, అడవి పందులైతే మనపై అటాక్ చేస్తాయి కూడా. అయినా ఒకరిద్దరు నాయకపోడ్ పిల్ల తల్లులు ఏడవ మూల మలుపు దగ్గర కంక బొంగులను కొట్టుకొచ్చుకొని వాటి ఈనెలతో తడకలు అల్లుతున్నారు. పాలుతాగే తమ పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి వచ్చి పొద్దంతా ఈ పని చేసి ఆ తడకలను సమీపంలోని ఊర్లలో అమ్మగా వారికి ఒక్కొక్కరికి వచ్చేవి 150 నుండి 200 రూపాయలట. ఇదంతా కూడా దొంగతనం చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు చూస్తే పట్టుకుంటారు. మరి ఎందుకమ్మా పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు?’ అనడిగితే, ‘ఏం చేయమంటరు సారు! మా మొగోళ్లు తాగి తందనాలాడుడే తప్ప రూపాయి సంపాయించరు కదా! ఇల్లెట్ల గడువాలె?’ అని ఎదురు ప్రశ్నించారు. సమాధానం చెప్పే శక్తి లేక ముందుకు నడిచాం.
ఏడవ మూల మలుపు ముగిసేచోట ఒక రాతి గద్దెపై ఒక మూరెడెత్తు రాయి నిలబెట్టి ఉంది. దాన్ని స్థానిక గూడేల గిరిజనులు నల్లపోచమ్మగా పూజిస్తారట. ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి, పాల కాయలు (కొబ్బరికాయలు) కొట్టి, కోళ్లు, గొర్రెలు మేకలను కోసుకొని పొద్దంతా దావతు (పార్టీ) చేసుకుంటార్ట. ఈ నల్లపోచమ్మ దగ్గరే నాలుగు దారుల కూడలి ఉంటుంది. ఉత్తరం వైపు వెళ్లేది గుండాలకు వెళ్తే ఈశాన్యం వైపు వెళ్లేది వీరన్న మడుగుకు వెళుతుంది. ఆ ప్రాంతపు అడవిలో అదొక్కటే నీటి వనరు కావడంతో అక్కడికి క్రూర జంతువులు కూడా వస్తాయి. అయినా మేము గుత్పలు (రాడ్‌ల వంటి కర్రలు) పట్టుకొని ఆ వీరన్నకుంట దగ్గరికి వెళ్లాం.మనిషే అన్ని క్రూర జంతువుల కంటే క్రూరమైన జంతువు. కాబట్టి మన అలికిడి (శబ్దం) వినగానే అవి పారిపోతాయిఅని నర్సయ్య పటేల్ అభయమిచ్చి తీసుకెళ్లాడు. వీరన్న గుడి మధ్యయుగాల్లో ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలించిన గోండు రాజుల నిర్మాణంగా కనిపించింది. పొడవాటి చెట్ల కొమ్మల మధ్య నుండి చొచ్చుకువచ్చి వీరన్న కుంటలో మిలమిలా ప్రతిబింబిస్తున్న సూర్యకిరణాల అందాలను చూసి తీరాల్సిందే.
వీరన్నకుంట నుంచి సుమారు ఒక కిలోమీటరు ఉత్తరం వైపు నడిచాక గుట్టబోర్ల మధ్యనున్న మైదానం కనిపిస్తుంది. ఈ మైదానం రానురాను విస్తరిస్తున్నది. కారణం, డ్వాక్రా, ఇందిరమ్మ తదితర ప్రభుత్వ పథకాల కింద ఈ అటవీ భూములను లబ్ధిదారులకు అసైన్ చేయడంతో వారు అడవులను నరికి సాగు చేసుకుంటున్నారు. అలా డీఫారెస్టేషన్ పెరిగి పర్యావరణానికి విఘాతం కలుగుతున్నదని ఎవరు చెప్పాలి? ఇక్కడే పశువులను, గొర్రెలను మేకలను పొద్దంతా అడవుల్లో మేపి రాత్రి ఒక కంచె కట్టి వాటిని అందులో ఉంచే ఏర్పాట్లున్నాయి. వాటి దగ్గరికి చిరుతలు, పులులు, తోడేళ్లు రాకుండా రాత్రంతా కాలేటట్లు ఒక పెద్ద చెట్టు మొద్దును అంటపెడతారు. ఇలా కారణాలు ఏవైనా ఫలితం ఒక్కటే.. డీఫారెస్టేషన్.
ఈ మైదానం మొదట్లో నిలబడి ఉత్తరం వైపు చూస్తే చిన్నచిన్న గుట్ట బోర్ల మొదట్లో అక్కడక్కడ అర్ధచంద్రాకారంలో పరచుకున్న ఆరేడు గోండు గూడేలు కన్పిస్తాయి. తడికల గోడల మీదనే బెంగుళూరు గూనను కప్పడం గోండులు ఈ మధ్య నేర్చుకున్నట్లు స్పష్టమవుతుంది. ఒక్కొక్క గూడెంలో ఉండే ప్రముఖ గోండు పెద్దను బట్టి ఆ గూడేన్ని ఆయన పేరుతో పిలుస్తారు. అలా మనకు లచ్చుపటేల్ గూడెం, మోతేరాం పటేల్ గూడెం, గుడిగూడెం అనే పేర్లు విన్పిస్తాయి. ఇక్కడికి దగ్గరలో మర్లవాయిలో నివసించిన ఆస్ట్రియన్ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 1940ల నుంచి 1990ల వరకు చేసిన ప్రచారం, కృషి పుణ్యమాని రాజ్‌గోండులు ఆహార సేకరణ, పోడు వ్యవసాయ పద్ధతులను వదిలి స్థానిక ఏరులకు అడ్డంగా ఆనకట్టలు కట్టి చెరువుల నేర్పరచుకొని వ్యవసాయం చేస్తున్నారు.
పరుపు బండల మీద వ్యవసాయం
పర్వత సానువుల మీద చదునైన భూములెట్లా ఉంటాయి? ఉండవు. అయితే ఇక్కడ 120 ఎకరాల మేర పరుపు బండలు విస్తరించాయి. హైమన్ డార్ఫ్‌కు వచ్చిన ఆలోచనో, మరెవరికి వచ్చిన ఆలోచనో గాని ఇక్కడి రాజ్‌గోండులు ఆ బండల మీదే వ్యవసాయం చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. అదేంటంటే, వర్షాలు రావడానికి ముందు సుమారు అర ఎకరానికి ఒక ఏటవాలు ఆనకట్ట కడతారు. వర్షాల వరదలకు గుట్టల నుండి మట్టి కొట్టుకొచ్చి ఆ ఆనకట్ట లెవల్‌లో (ఒకటి నుంచి రెండు ఫీట్ల ఎత్తు) పేరుకుపోతుంది. ఆ పోల్ మట్టిలో రాళ్లు ఏవైనా ఉంటే ఏరి చిన్నచిన్న మడులుగా చేసుకొని ఆ మడులలో వ్యవసాయం చేస్తారు. అవసరమే ఆవిష్కరణలకు మూలం అనడానికి ఇదొక నిదర్శనం. అయితే ఈ భూములకు నీటి వనరైన చెరువును కట్టించింది మాత్రం బాజీరావు అనే గోండు ప్రముఖుడట. ఆయన గుండాలలో ఆగ్నేయంలో ఉన్న గుడి గూడెం పై నుండి పారే ఒక వాగుకు అడ్డంగా ఈ చెరువును కట్టి దాని కింది భూములను స్థానిక రాజ్‌గోండులందరికీ సమానంగా పంచాడట. అయితే ఈ చెరువు కట్టడం వల్ల వర్షాకాలం తరువాత చెరువు నుంచి వచ్చే అలుగు తగ్గిపోయి నవంబర్ తరువాత వాటర్‌ఫాల్స్ దుముకకుండా పోతుంది. బాజీరావు సమాధిని ఇప్పుడు గుడిలాగా పూజిస్తున్నారు.
వాటర్‌ఫాల్స్ వాగులో వాకింగ్..
పరుపుబండల పొలాల తూర్పు నుండి సుమారు కిలోమీటరున్నర దూరం ప్రయాణించే అలుగు వాగు సడన్‌గా ఈశాన్యం మూలలో ఒక గుట్ట అడ్డుపడటంతో పడమర వైపుకి తిరిగి పారుతుంది. ఒక ఫర్లాంగు దూరం తరువాత 25 ఫీట్ల ఎత్తు నుండి దుమికి మనకు మొదటి వాటర్‌ఫాల్స్‌లాగా దర్శనమిస్తుంది. ఇక ఇక్కడి నుండి అర్ధచంద్రాకారంలో వాయవ్యం మీదుగా ఉత్తరం వైపు తిరిగి పారుతుంది. సుమారు ఒక కిలోమీటరు దూరం. ఈ అర్ధచంద్రాకార పారకం ఒక అద్భుతం. ఎందుకంటే, ఈ ప్రవాహ మార్గం పది గజాల ఎత్తు/లోతు, పది గజాల వెడల్పుతో రాతిని కట్ చేసి ఏర్పరచినట్లుంటుంది. ఇందులో జలజల పారే వాగులో గంతులేసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ సరదాగా సాగే పదిహేను నిమిషాల నడక జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతినిస్తుంది.
ఒక ఫర్లాంగు దూరం ఇలా నడిచాక ఈ వాగు పది అడుగుల ఎత్తు నుండి దుముకుతూ రెండవ జలపాతంలా దర్శనమిస్తుంది. ఈ జలపాతం కింద ఒక అద్భుతమైన బట్ ప్రమాదకరమైన గుండం కనిపిస్తుంది. పేరు సవతుల గుండం. ఈ గుండం సాలిడ్ రాక్‌లో ఎంత లోతు వరకు ఉందంటే.. ఈ గుండం నీటిలో రాయి వేసినప్పుడు అది సుమారు వంద సెకన్లు ప్రయాణించి అడుగుకు చేరుకున్నట్లు బుడగలను పైకి పంపింది. వాగు ఎండిపోయినా ఈ గుండం మాత్రం ఎండాకాలం కూడా ఎండిపోదట. ఇక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి ఎన్నో జంతువులు కాలు జారిపడి చనిపోయాయట. అలాగే ఇద్దరు సవతులు ఇక్కడ పేలు చూసుకుంటూ ఒకర్నొకరు లాక్కొని ఇందులో పడి చనిపోయారట. కాబట్టే దీనికి సవతుల గుండం అని పేరు అని మోతేరాం పటేల్ చెప్పాడు.
అత్యంత ఎతె్తైన వాటర్ ఫాల్స్
అలుగు వాగు ఉత్తరాభిముఖంగా పది మీటర్ల వెడల్పులో సుమారు 150 మీటర్ల ఎత్తు పైనుండి నిటారుగా దూకడంతో రాష్ట్రంలో అత్యంత ఎతె్తైన గుండాల వాటర్‌ఫాల్స్ ఆవిష్కృతమైంది. పది ఇరవై మీటర్ల ఎత్తు నుండి దూకే వాటర్‌ఫాల్స్‌ను చూసే ఆనందించే పర్యాటకులకు ఇంత ఎతె్తైన, అరుదైన గుండాల వాటర్‌ఫాల్స్‌ను చూస్తే ఎంతటి ఆనంద హర్షాతిరేకాలకు గురవుతారో ఊహించుకోవచ్చు. 90 డిగ్రీల లంబ కోణంలో ఈ వాటర్‌ఫాల్స్ దుముకడంతో దీని అందం మరింత ఇనుమడించింది. అయితే ఈ వాటర్ ఫాల్స్ అంత ఎత్తు నుంచి ఒక బండ పరుపుపై దుముకడంతో ఆ వాటర్‌లో వచ్చే చేపలు చచ్చిపోతున్నాయట. ఇంత ఎత్తు నుంచి దుమికే వాటర్ ఫాల్స్ మంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణానికి అనుకూలిస్తుందని రాష్ట్ర ఇంజనీర్లు వచ్చి చూశారట. ఐతే వర్షాకాలం తప్ప ఈ వాటర్ ఫాల్స్ దుముకకపోవడంతో అంత ప్రయోజనకరం కాదని వదిలేశారట. మేం వెళ్లిన ఫిబ్రవరిలో కూడా ఈ వాటర్‌ఫాల్స్ దుముకకపోవడం మాకు వొకింత నిరాశనే కలిగించింది.
వ్యూపాయింట్
అయితే ఈ వాటర్‌ఫాల్స్ పరిసరాలు గొప్ప వ్యూ పాయింట్ కావడం వల్ల మా సాహస యాత్రకు సార్ధకత చేకూరినట్లే. వాటర్‌ఫాల్స్ వాగులో అది కిందికి దుమికే పాయింట్ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుండి కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయి. అయినా నిబాయించుకుని చూస్తే వాటర్‌ఫాల్స్ పడిన చోట పెద్ద గుండం ఏర్పడింది. ఏపుగా పెరిగిన చెట్ల మధ్య నుండి ఇది కనిపిస్తుంది. చెట్ల పచ్చదనం ఆ గుండం నీళ్లల్లో ప్రతిఫలించి ఆ నీళ్లు కూడా పచ్చగానే కన్పిస్తాయి. వాగు వాటర్‌ఫాల్స్‌గా మారే చోట ఎడమ వైపున ఒక గుహ ఉంది. అందులో సుమారు ఇరవై మంది కూర్చోవచ్చు. ఆ గుహలో నిల్చుని పడమర నుండి ఉత్తరం మీదుగా తూర్పు దిక్కు వరకు ఎటు చూసినా ఎతె్తైన కొండలు, పచ్చని చెట్లతో చిక్కగా అలంకరించబడి కన్పిస్తాయి. వాటిపై నుండి వచ్చే ఈదురు గాలిని ఆస్వాదిస్తూ ఆదమరిచి వాటర్‌ఫాల్స్ కింద పడిపోతామేమో అనిపిస్తుంది.
వాటర్‌ఫాల్స్ కింది గుండాన్ని నాలుగు దిక్కులా నాలుగు పర్వత శ్రేణులు చుట్టుముట్టాయి. ఒక్క వాయవ్య మూలలోనే ఒక ఇరుకు సందు ఉండటంతో ఈ గుండంలోని నీరు ఆ సందు గుండా పారిపోతున్నది - దొంగలా ఎవరికీ కనపడకుండా. ఈ గుండం దగ్గరికి చేరుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడికి చేరుకోవడం అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడికి పశ్చిమం వైపు నుండి గాని, తూర్పు వైపు లోయ నుండి గాని చేరుకోవచ్చు. ఒక్కొక్క రాయిని జాగ్రత్తగా దాటుకుంటూ గుండం దగ్గరికి చేరుకున్నాక గుండె బరువంతా దిగిపోతుంది - ఆ గుండం పరిసరాల అందాలను చూసి.
చుట్టూ ముసురుకున్న గుట్టల మధ్య కేవలం 150 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు/లోతు కొలతలతో ఒక బావిని తవ్వితే ఆ బావి అడుగున నీరు ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది ఈ గుండం. అంత ఇరుకుగా ఉంటుంది కాబట్టి అక్కడ అరుస్తే ప్రతిధ్వనులు పదింతలు రెట్టింపయి మార్మోగుతాయి. మన కేరింతలకు తోడు పక్షులు చేసే కిలకిలలు.. పరవశించో, పరవశింపజేయడానికో, పారిపోతూనో.. మనల్ని పరవశింపజేస్తాయి. ఇలా ఆనందిస్తూ అక్కడ నిద్రాహారాలు మరిచి కూడా ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. ఈ గుండానికి ఉత్తరాన ఫర్లాంగు దూరంలో మరో వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి ఇరుకైన వాగు ప్రవాహంలో వాకింగ్ చేయటం ఎంతో బావుంటుంది. కాని ఈ గుండం ప్రాంతం అరుదైన నీటి వనరు కాబట్టి అక్కడికి క్రూర జంతువులు వస్తాయి. కనుక పొద్దుగుంకక ముందే అక్కడి నుండి బయలుదేరవలసి ఉంటుంది.
ఎలుగు దొనలు, తేనె తుట్టెలు
ఈ వాటర్‌ఫాల్స్ పరిసరాల్లోని వ్యూపాయింట్‌ను కెమెరాలో బంధించడం అంత ఈజీగా సాధ్యపడదు. అయినా ప్రయత్నిస్తే అలా అలా నడుస్తూ వాటర్‌ఫాల్స్‌కు కుడివైపున రాళ్లపైకి వెళ్లి ఫొటోలు తీస్తుంటే మోతేరాం పటేల్ త్వరగా అక్కడ్నుంచి రమ్మని కేకలు వేశాడు. వచ్చి అడిగితే నేను ఎక్కిన రాళ్ల కింద దొనలో రెండు ఎలుగు బంట్లున్నాయని చెప్పాడు. బతుకుజీవుడాఅనుకున్నాను. కాని స్థానిక గిరిజనులు మాత్రం ఆ ఎలుగు దొన కింద ఇరుకు సందులో ఉన్న అరుదైన ఖండోరా చెట్ల చెక్కను ఏ భయమూ లేకుండా సేకరిస్తారట. ఆ చెక్క ఎటువంటి నొప్పులు, గాయాలనైనా అతి కొద్ది రోజుల్లోనే మానే్పస్తుందట. నిటారుగా ఉన్న వాటర్‌ఫాల్స్ బండకు పైన తాడు కట్టుకొని లోయలో వేలాడుతూ కొలాము గిరిజనులు ఆ బండకు పెట్టిన తేనె తుట్టెల నుండి తేనె తీస్తారట. పొరపాటున తాడు తెగినా, ఊడినా 150 మీటర్ల లోయలో పడిపోవడమే. ఊహే భయంకరంగా ఉంటుంది.
ఇలా సాహసాలకు నిలయమైన గుండాల వాటర్ ఫాల్స్‌ను సాహస యాత్రికులు సందర్శించవలసిందే. ప్రభుత్వం పట్టించుకుంటే ఇది అద్భుతమైన ఎకో టూరిస్ట్ స్పాట్ అవుతుంది.
                                                                                                    -డా.ద్యావనపల్లి సత్యనారాయణ
                                                                                                                  9440687250

Monday 2 April 2012

Article on SreeRaama in Telanagana published in Namaste Telangana on 1-4-2012 and 8-4-2012 on the eve of SreeRaama Navami

తెలంగాణలో రాములవారు నడయాడిన స్థలాలు

Lonkaరాముడు తెలంగాణలో సంచరించాడనడానికి మూడు రకాల ఆధారాలు కన్పిస్తున్నాయి. ఒకటి వాల్మీకి రామాయణం (అరణ్యకాండ), రెండు పురావస్తు-చారివూతక విశేషాలు, మూడు జానపద స్థల పురాణ గాథలు.సీతారామ లక్ష్మణులు తమ పద్నాలుగేళ్ళ వనవాసంలో భాగంగా ఉత్తర, మధ్య భారతంలో అనేక స్థలాలు తిరుగుతూ వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించారని, ఆ తర్వాత చిత్రకూట పర్వతాన్ని చేరుకొని పర్ణశాల నిర్మించుకున్నారని మనకు తెలుసు. అయితే, అగస్త్య మహర్షి రాములవారిని దక్షిణాన గోదావరి తీరాన ఉన్న పంచవటికి వెళ్లమని చెప్తూ ‘‘తాడిచెట్ల వనం దాటి ఉత్తరం గుండా మఱ్ఱి చెట్టు వద్దకు చేరుకొని, అక్కడి నుండి పర్వత తలంపై నడవాలి’’ అని వివరించినట్లు అరణ్యకాండ 13వ సర్గలోని 13,1,21,22 శ్లోకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ‘పంచవటి’ అంటే మఱ్ఱి, మారేడు, మేడి, రావి, అశోక వృక్షాల వనాలుండే ప్రదేశమని అర్థం. ఈ వనాలున్న ప్రదేశం గోదావరి నది వెంట కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా నుండి ఖమ్మం జిల్లా తూర్పు సరిహద్దుల వరకూ ఉండేది. ఇంత విశాలమైన పంచవటిలో రాముడు మొదట పర్ణశాల నిర్మించుకున్నది చిత్రకూటంపైన.

‘‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’’ (మూలంలో లేనిది చెప్పను, అనవసరమైంది అసలే చెప్పను) అని ఢంకా బజాయించి చెప్పుకున్న అగ్రక్షిశేణి వ్యాఖ్యానకారుడు మల్లినాథసూరి ‘చివూతకూటం అంటే రామగిరి’ అని చెప్పాడు. ఆయన మన మెదక్ జిల్లా వాసి అన్నది తెలిసిందే. నిజానికి ‘అరణ్యకాండ’లోని పైన పేర్కొన్న శ్లోకాలలో వివరించినట్లుగానే రామగిరికి ఉత్తరాన వేల తాడి చెట్లుండటం విశేషం. అట్లే, ఆగ్నేయంలో ‘తాడిచెట్ల’ అనే ఊరు కూడా ఉన్నది. ఆ శ్లోకంలో చెప్పినట్లే, రామగిరి పర్వత తలంపై 10 కిలోమీటర్లు నడవాలి కూడా. ఇంకొక గొప్ప విషయమేమిటంటే, రాముడు ఇక్కడికి వచ్చినప్పటి సంగతి! అంటే క్రీ.పూ. 5179వ సంవత్సరం నాటి మధ్య శిలాయుగ మానవుల స్థావరం, వారి పనిముట్లు, ఆయుధాలు ఇక్కడ లభించడం! వీటిని 197లో పెద్దపల్లి నివాసి ఠాకూర్ రాజారాం సింగ్ పూర్వ పురావస్తు శాఖ సంచాలకులు వి.వి.కృష్ణశాస్త్రి సమక్షంలో రామగిరి గుట్ట మొదట్లో సేకరించారు.
‘సీతాస్నాన పుణ్యోదకేషు రామగిరి’ అని క్రీ.శ. 5వ శతాబ్దంలో మహాకవి కాళిదాసు తన మేఘసందేశం’ కావ్యంలో రాశారు. వారు రాసినట్లుగానే ఈ రామగిరిపై సీత స్నానం చేసిన కొలనులూ ఉన్నయి. ఆమె పసుపు కుంకుమలు ఇక్కడి రాళ్ళ నుంచి సేకరించుకున్న ఆనవాళ్లు...అంటే గుంటలు కూడా ఉన్నయి. అట్లే, సీతారామ ప్రతిష్టిత శివలింగాలను కూడా మనం రామగిరి పైన ఇప్పటికీ చూడవచ్చు. అంతేకాదు, రాముడు భూమిలోకి శక్తివంతమైన బాణాలను సంధించి సృష్టించిన ఊటలను కూడా రామగిరిపై చూడవచ్చు.

రాముడు ఇక్కడున్నప్పుడే దశరథుడు మరణిస్తాడు. దాంతో తండ్రికి ఇక్కడే పిండం పెట్టాడని స్థానికులు చెప్తరు. తదనంతరం భరతుడు ఇక్కడికి వచ్చి రాముడి పాదుకలను అయోధ్యకు తీసుకెళ్ళాడని అంటరు. ఈ చరివూతాత్మక విషయాలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు కూడా రామగిరి కొండ కోనపైనున్న గుహలో మనం చూడవచ్చు.అయితే, రాముడి ఉనికి ఈ ప్రాంతపు రాజు ఖరునికి కంట గింపయిందట అతని సైన్యం మునులు, ఋషులపై అఘాయిత్యాలకు పాల్పడిందట. దాంతో రాముడు మునుల కోసం ఈ జనస్థానాన్ని (రాజధాని ఖరియాల్, చత్తీస్‌ఘడ్) వదిలి దండకారణ్యంలోకి ప్రవేశించాడని తెలుస్తున్నది. ఈ అరణ్యం మంత్రకూటం అంటే మంథని - దాని తూర్పు నుండి ప్రారంభిమవుతుందని కూడా గమనించవచ్చు. రాములవారు దండకారణ్యంలో మొదట ఎదురైన విరాధుడు అనే రాక్షసుని చేతులు నరికి శరభంగ మహాముని ఆశ్రమంలో గడుపుతున్నప్పుడు ఆ ప్రాంత మునులందరూ ఆయన దగ్గరికి వచ్చారట. వారంతా మునుపూందరినో రాక్షసులు చంపుతున్నారని చెబుతూ, వారి బొక్కలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఒక స్థలాన్ని కూడా రాములవారికి చూపారట. ఆ స్థలం ఇప్పటికీ ‘బొక్కల గుట్ట’ పేరుతో రామగిరికి వాయవ్యాన -మంచిర్యాలకు 5 కి.మీ. దూరంలో ఉండటం కూడా ఒక ప్రబలమైన ఆధారంగా కనిపిస్తున్నది.

Raamagiripaiమునులకు అభయమిచ్చిన సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో ఉన్న సుతీక్షుడు తదితర మునుల ఆశ్రమాలను దర్శిస్తారు. ఇక అదే రోజు పొద్దుగూకే సమయంలో పంచాప్సర సరస్సును చూశారట. ఆ సరస్సును మాండకర్ణి అనే ఋషి సృష్టించుకొన్నడు. అందులో ఆయన ఒక రహస్య మందిరాన్ని నిర్మించుకొని వాటిల్లో ఐదుగురు అప్సర సలతో రతి సుఖాలను అనుభవించాడట. ఈ సంగతి ధర్మభృతుడనే ఋషి రాముడికి చెప్పినట్లు అరణ్యకాండ 9వ సర్గ -1 శ్లోకాలలో ఉన్నది. మాండకర్ణి తాలూకు ఈ వ్యవహారాన్ని బట్టి ఆ సరస్సును స్థానికులు ఇప్పుడు ‘లంజమడుగు’ అంటున్నరని కూడా మనం గమనించాలి. ఇది గోదావరిలో మంథనికి సమీపంలో ఉంది. మాండకర్ణి తాలూకు ఈ కథ ఎంతగా ప్రచారమయ్యిందంటే ఆ వృత్తాంతాన్ని తెలిపే శిల్పం విజయవాడ కనకదుర్గ ఆలయ సమూహంలోని శిథిల ఆలయంపైన కూడా ఉన్నది. ఇలాంటి శిల్పాలు ఈ ప్రాంత గుహాలయాల్లో కూడా ఉన్నయి.
ఇక, ఇక్కడి నుంచి రాముడు ఖమ్మం జిల్లాలోని ప్రస్తుతం పర్ణశాల ఉన్న ప్రాంతానికి వెళుతున్నప్పుడు మధ్యలో జటాయువు అనే (టోటెమ్) పక్షిరాజు ఎదురై తాను దశరథునికి స్నేహితున్నని చెప్తూ, ప్రసంగ వశాన సృష్టిలో జీవజాల పుట్టుక ఎలా జరిగిందో వివరిస్తడు. (14వ సర్గ). ఈ వివరణ తాలూకు శిల్పాలను మనం రామగిరి ఖిల్లా రెండవ, మూడవ కోటల దర్వాజాలపై చూడవచ్చు. మరో విషయం, ఈ ప్రాంతంలో రామాయణ కాలం నాటి జటాయువు లేదా గద్దను (సంస్కృతంలో గృధ్రం) పూజించే వారి ప్రాబల్యం ఉండేది. ఇక్కడి నుండి తూర్పు వైపున్న అరణ్య ప్రాంతానికి అతి ప్రాచీన కాలంలో ‘గృవూధవాడి’ అనే పేరు ఉన్నట్లు కూడా శాసనాల ద్వారా తెలుస్తున్నది. గద్దను తమ జెండాపై చిత్రించుకున్న పొలవాస రాజులు ఈ ప్రాంతంలో క్రీ.శ.12వ శతాబ్దం వరకూ పరిపాలన చేశారన్నది చరిత్ర. ఇలాంటి జెండాలను ఇప్పటికీ మనం సమ్మక్క జాతరలో చూడవచ్చు.

సీతారామ లక్ష్మణులు నేటి ఖమ్మం జిల్లాలో గోదావరి తీరాన పర్ణశాల కట్టుకొని కొంతకాలం హాయిగా గడిపారు. భద్రాచలానికి ఉత్తరాన సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్ణశాల పంచవటి ప్రాంతంలో భాగమే. ఇక్కడ ఒక వటవృక్షం కింద రామపాద ముద్రలున్నయి. ఈ పర్ణశాల ప్రాంతం ఒక అందమైన సంగమ ప్రదేశం. ఇక్కడ గోదావరిలో తాలిపేరు, సీలేరు, సీతవాగు కలుస్తయి. సీతవాగులో సీత స్నానం చేసి వాగులోని బండల మీద తన పట్టుచీరలు, నారచీరలను ఆరబెట్టుకున్నప్పుడు వాటి రంగు అంటిన చారలను మనం నేటికీ అక్కడ దర్శించవచ్చు. రాముడు స్నానం చేసిన స్థలాన్ని ఇప్పుడు ‘స్నానాల లక్ష్మీపురం’ అంటున్నారు. ఇది వైరా మండలంలో ఉంది. ఇక్కడ శివరావూతినాడు లక్షలాదిమంది భక్తిక్షిశద్ధలతో స్నానం చేస్తరు.

సీతారాములు పర్ణశాలలో ఉన్నప్పుడు అక్కడి పరిసర ప్రాంతాలలో కూడా తిరిగారని పరంపరగా వస్తున్న మౌఖిక ఆధారాలు తెలియజేస్తున్నయి. అలా వారు అదే గోదావరి వెంట నేటి భద్రాచలం వరకూ వచ్చి, ఆ గిరిపై కొంత సమయం విశ్రాంతి కూడా తీసుకున్నారని, అదే స్థలంలో భద్ర మహర్షి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కూడా ప్రతిష్టించి పూజలు ప్రారంభించారని భద్రాచల స్థలపురాణం తెలియజేస్తున్నది. ఇక్కడికి ఆగ్నేయంలో ఆన్న ఉష్ణకుండంలో చలికాలంలో సీత స్నానం చేసేదని కూడా చెప్తరు. ఈ సందర్భంగా ఇదే ప్రాంతంలో నవీన శిలా యుగానికి చెందిన మానవుల స్థావరపు పనిముట్లను డా॥ పి.వి.పరవూబహ్మశాస్త్రి గుర్తించిన విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలె.

ఖమ్మం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉన్న ‘నాగులవంచ’కు కూడా రాముడు వచ్చిండనుకోవచ్చు. ‘వంచ’ అంటే ‘వాగు’ అని అర్థం. ఆయన ఇక్కడి వంచలో స్నానం చేశాడట. ఇక్కడున్న అతి ప్రాచీన కోదండ రామాలయంలో భద్రాచలంలో ఉన్నట్లే సీతారాములు ఒకే వేదికపై దర్శనమిస్తరు. ఇక్కడే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తున్నటువంటి శిల్పం కూడా చిత్రితమైంది. సమీపంలోని గజగిరి నరసింహస్వామి గుట్టపై ఉన్న దేవుడు ప్రసిద్ధి చెందిన మంగళగిరి పానకాల స్వామిలా ఎంత పానకం పోసినా తాగేస్తడు. అంతేకాదు, ఇదే నాగులవంచలో సీతారాములు సృష్టించుకున్నవిగా చెప్తున్న సీతానగర్, రామసముద్రం అనే రెండు చెరువులు కూడా ఉన్నయి.

సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో ఉన్నప్పుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ (అంటే చాటంత చెవులు కలదని అర్థం) ఇక్కడికి వచ్చి రాముడిని మోహిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోస్తడు. దానికి ఆగ్రహించిన ఈ ప్రాంత పాలకుడు, శూర్పణఖ అన్న అయిన ఖరుడు రాముడిపై పద్నాలుగువేల మంది సైన్యంతో యుద్ధం చేస్తడు. ఆ యుద్ధ సమయంలో సూర్యక్షిగహణం సంభవించిందని, ఆ రోజు రాత్రి అమావాస్య అని, అప్పుడు మధ్యలో ఉన్న అంగారక గ్రహానికి ఒక పక్క బుధ-శుక్ర గ్రహాలు, మరో పక్క శని గ్రహం - సూర్యుడు ఉన్నారని అరణ్యకాండ 23వ సర్గ 10-13,34 శ్లోకాలలో వాల్మీకి వివరించిండు. ఈ గ్రహస్థితిని అమెరికన్ టైమ్ మిషన్‌లో పొందుపర్చినప్పుడు అది ఆ రోజు తేది క్రీ.పూ. 5077 అక్టోబర్ 7 అని సూచించిందని ‘డేటింగ్ ది ఎరా ఆఫ్ లార్డ్ రామ’ అనే పుస్తకంలో పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పేర్కొన్నాడు. ఆ నాటి యుద్ధంలో రాముడు ఖర, దూషణ, త్రిశిరాదులతో సహా 14వేల మంది రాక్షస సైన్యాలను చంపుతున్నప్పుడు రాముని సూచన మేరకు లక్ష్మణుడు సీతను ఒక కొండ గుహలో దాస్తడు. ఆ కొండ పేరు లక్ష్మణకొండ. ఈ యుద్ధం జరిగిన స్థలం దుమ్ముగూడెం, లక్ష్మణకొండ ప్రాంతాలు. ఇవి పర్ణశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటయి. దుమ్ముగూడెంలో అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వరాలయం కూడా ఉన్నది.

రాముడు ఖరున్ని చంపాక శూర్పణఖ రావణుడితో మొరపెట్టుకుంటది. దాంతో రావణుడు లంక నుండి ఇక్కడికి వచ్చి మారీచున్ని ఒప్పించి అతని సహకారంతో సీతను ఎత్తుకుపోయే పథకం పన్నుతడు. రావణుడు ఇక్కడికి కంచర గాడిదల రథం మీద వచ్చిండని, సరైన సమయం కోసం గోదావరి ఆవలి ఒడ్డున వేచి ఉన్నడని, ఆ వేచివున్న గుట్టపేరు ‘రావణగుట్ట’ అని, అతని రథ చక్రాల గాడి ఇదే అని స్థానికులు ఆ గుట్టపై ఉన్న ఆనవాళ్ళను చూపిస్తరు. రావణుడు సీతను ముట్టజాలక ఆమె నిల్చున్న భూమినంతా పెకిలించుకొని పోవడంతో ఆ ప్రాంతంలో ఏర్పడ్డ గుంటను ‘రావణుకొలను’ అని కూడా అంటున్నరు. ఇది పర్ణశాలలోని రామాలయం వెనక ఉన్నది. సమీపంలోనే ‘దశకంఠేశ్వరాయం’ అనే శివాలయం కూడా ఉంది. అందులో శివలింగాన్ని పరమ శివభక్తుడైన దశకంఠుడు అంటే రావణుడే తను లంక నుండి తెచ్చి ప్రతిష్టంచిండని చెబుతరు.

రావణుడు తనను ఎత్తుకుపోతున్న విషయాన్ని గురించి సీతమ్మ తన రాముడికి చెప్పండని మాల్యవంతం పైనున్న ప్రస్రవణగిరికి, గోదావరికి చెప్పిందట. ఈ ప్రస్రవణమే తెలుగులో ‘పొరవణం’గా, క్రమంగా ‘పోలవరం’గా మారింది. సుమారు రెండు శతాబ్దాల కింద భద్రాచలంపై జరిగిన ధంసా (దొంగ గిరిజనుల) దాడి సమయంలో భద్రాచల రాముడ్ని రహస్యంగా ఈ పోలవరం మీదికే తీసుకొచ్చి, ప్రతిష్టంచి పూజించారు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ భద్రాచలానికి తీసుకొచ్చిండ్రు.

సీత అరుపులను విని జటాయువు రావణుడ్ని ఎదిరించిండు. కానీ, రావణుడు జటాయువు రెక్కలను నరికివేసిండు. ఆ రెక్కలు పడిన స్థలం పేరు ‘రెక్కపల్లి’. అది క్రమంగా ‘రేకపల్లి’ అయ్యింది. జటాయువు రాముడికి సీతాపహరణ విషయం చెప్పి మరణించిన స్థలమే ‘జటపాక.’ అది కాలక్షికమంలో ‘ఎటపాక’ అయ్యింది. ఇక్కడ ఇప్పుడు ‘జటాయువు మంటపం’ కూడా ఉన్నది. పక్కనే భద్రాచలానికి 5 కి.మీ.ల దూరంలో ‘జటాయువు పర్వతం’ కూడా ఉంది. రాములవారు చనిపోయిన ఆ జటాయువుకు సమీపంలో ఉన్న గోదావరిలో పిండాలు పెట్టిండట. అలా పిండాలు పెట్టిన ప్రదేశం పేరుతో తెలంగాణలో కొన్ని చోట్ల ‘పెండ్యాల’ అనే ఊర్లేర్పడినాయి.

RaamunigunDaalaloరావణుడు తనను ఆకాశమార్గంలో ఎత్తుకు పోతున్నపుడు సీత కింద కనిపిస్తున్న ఐదుగురు వానరులను చూసి తన నగలను ఒలిచి, తన పట్టు ఉత్తరీయంలో చుట్టి వారి దగ్గర పడేసిందట. ఆ ప్రదేశం పేరు ‘సీతంపేట’ అయ్యింది. ఇది భద్రాచలానికి తూర్పున 50 కి.మీ.ల దూరంలో కూనవరానికి దగ్గర్లో ఉంది. అటు తర్వాత రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ కూనవరానికి వచ్చారు. అక్కడ వారికి స్థానిక సవర తెగ స్త్రీ శబరి కనిపించింది. ఆమె రేగుపళ్ళ రుచి చూసి తియ్యగా ఉన్నవాటిని రాముడికి తినిపించింది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ‘శ్రీరామగిరి’ అంటున్నరు.

ఈ కూనవరం దగ్గరే శబరి నది ఉత్తరం నుండి వచ్చి గోదావరిలో సంగమిస్తుంది. పాపికొండల టూర్ బోట్లు ఇక్కడి నుండే గోదావరిలో ప్రయాణిస్తయి. సమీపంలో వాలి సుగ్రీవుల కొండ కూడా ఉన్నది. ఆ కొండపై వాలి సుగ్రీవులు కొట్లాడినారని అంటరు. అయితే, వాళ్లు కొట్లాడినట్లు తెలిపే శిల్పాలు ఇక్కడికి దక్షిణంగా కొన్ని పదుల కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని కామవరపు కోట గ్రామ పరిధిలోని కొండల్లో ఉన్నయి. ఆ కొండల్లో వాలి భార్య తారను పూజించే ఒక ప్రాచీన గుహాలయం ఉన్నది. వీటన్నిటి మూలంగా కూనవరం దగ్గర వాలి సుగ్రీవుల కొండలో రాముడు వాలిని చంపినట్లు, సుగ్రీవునితో స్నేహం చేసి అతని సహచరులను నలు దిశలకు పంపి సీతను వెదికించినట్లు అనుకోవడానికి ఆధారం లభిస్తుంది. కూనవరంలోని రామాలయంలో యోగరాముని విగ్రహం ఉంది. దీనికీ ఒక కారణం కనిపిస్తుంది. రాముడు పర్ణశాలలో ఉన్నప్పుడు ఇక్కడున్న మతంగముని ఆశ్రమంలో యోగ నేర్చుకున్నారట.

చారివూతక స్థలాలు
కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని అడవి సోమనపల్లిలో ‘ఎక్కటె విమున’ అనే అతడు క్రీ.శ. 10వ శతాబ్దంలో రామేశ్వర ప్రతిష్ట చేసినట్లు అక్కడ శాసనమున్నది. ఈ ఊరికి ఉత్తరాన గోదావరికి అవతల విమునపల్లి (వేమనపల్లి)లో కూడా అనేక శిథిల శిల్పాలున్నయి. అక్కడ కూడా ఈ ‘ఎక్కటె విమున’ అనే అతనే రామేశ్వర దేవాలయం కట్టించి ఉండవచ్చునని, అతని పేరుతో ఉన్న ఊరు పేరును బట్టి ఊహించవచ్చు. అడవి సోమనపల్లి రామేశ్వరాలయం కోసం క్రీ.శ. 110 ప్రాంతంలో పెనుకంటి ముచ్చిడ్డి అనే రామగిరి ప్రాంత రాజు భూదానం చేశాడని తెలిపే శాసనం కూడా లభిస్తున్నది.కరీంనగర్ జిల్లాలోనే ఉన్న పొట్లపల్లి రామాలయానికి సాగు నీరును తోడే ‘మోట రాట్నాన్ని’ కళ్యాణి చాళుక్యరాజు త్రిలోకమల్లదేవుని మహాసామంతుడు- రేగొండ రాజు చందయ్యరసర్ మకీ.శ. 1066 మార్చి 14వ తేదీ ఆదివారం (చంవూదక్షిగహణం) నాడు దానం చేసిండని ఆలయ శిలాశాసనంలో ఉంది. రాముడు తన తండ్రికి ‘ఉల్లింతపప్పు’తో శ్రాద్ధం పెట్టినట్లు చెప్పబడుతున్న ప్రాంతం ఇదే. అది ‘ఇల్లంతకుంట’కు సమీపంలోనే ఉండటం గమనార్హం.

కరీంనగర్ జిల్లాలోని యెల్గేడులోని రామనాథ దేవరకు ఓరుగల్లు కాకతీయరాజు రెండవ ప్రతాపరువూదుని ఒక భార్య లకుమాదేవి తన తండ్రి పేర స్థానిక పన్నులను క్రీ.శ. 1301 జూన్ 27 నాడు వృత్తిగా (దానంగా) ఇచ్చినట్లు అక్కడ శాసనమున్నది. ఇదే జిల్లాలోని విలాసాగర్‌లో ఉన్న రామేశ్వర దేవాలయానికి క్రీ.శ. 1302లో మల్యాల వంశ రాజులు దానం చేసినట్లు తెలిపే శాసనం కూడా ఆ ఆలయంలో ఒకటున్నది.
నిజామాబాద్ జిల్లాలోని బండరామేశ్వరపల్లి దేవాలయంలోని శ్రీరామనాథ దేవునికి క్రీ.శ. 1264లో రాణి రుద్రమదేవి సామంతుడు ‘గుండయ పిన్నవేలుకొండ’ అనే గ్రామాన్ని దానం చేసినట్లు ఆ ఆలయ స్తంభ శాసనం తెలియజేస్తోంది. ఇదే జిల్లా తాండూరులో త్రిలింగ రామేశ్వరాలయం అనే ఒక శిల్పకళాశోభిత చారివూతక ఆలయం ఉంది. అలాగే సిరికొండ మండలం లొంక రామాలయంలో కూడా కనీసం క్రీ.శ. 5వ శతాబ్దం నుండే మూలాలున్నాయని అక్కడి శాసనాలు, పురావస్తు విశేషాల ఆధారంగా తెలుస్తున్నది.
హైదరాబాద్ దగ్గరి కీసరగుట్ట పైనున్న 10 శివలింగాలను క్రీ.శ. 5వ శతాబ్దంలో విష్ణుకుండి రాజు రెండవ మాధవవర్మ తన ఒక్కొక్క యుద్ధ విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్టించాడనేది చారివూతక సత్యం. మార్చి 11నే ఆయన అక్కడ కట్టించిన యాగశాలలు బయటపడినట్లు ఫొటోలతో సహా పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయం దక్షిణ ముఖ మండపానికి ఎదురుగా ఉన్న క్రీ.శ. 1313 నాటి స్తంభశాసనంలో ఈ దేవాలయానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాల కాలాల్లో ఇవ్వబడుతూ వస్తున్న మాన్యాలను ఫిబ్రవరి 26న స్థిరీకరించినట్లు ఉంది. అందులో కుసలనాటిలోని మల్లికార్జునింపల్లి, సాసుఱ్ఱాల, పిప్పరిగె, కలుచెఱులు, దేవరపల్లి అనే ఐదు గ్రామాలు కూడా మాన్యాలుగా పేర్కొని ఉన్నయి. ఈ కుసలనాడు గ్రామాలు మెదక్ జిల్లాలోనివి. ఈ కుసలనాడు మొదట అంటే త్రేతాయుగంలో కుశస్థితి అని, అంటే రాముడి కొడుకు కుశుడు పాలించిన ప్రాంతమని వి.వి.కృష్ణశాస్త్రి అభివూపాయం.
అయితే, రాముడి గురువు విశ్వామివూతుని వంశంలో కూడా ఒక కుశుడు ఉన్నాడు. అతని కథను రాముడికి వినిపించడం జరిగింది. విశ్వామివూతుడు తన యాభై మంది కొడుకులను ఆంధ్రులలో కలిసి పొమ్మని శపించిండు. కాబట్టి, ఆనాడు ఆంధ్రులు నేటి తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉండేవారు. వాళ్లలో ఒకడైన కుశుని పేర ఇది ‘కుశలనాడు’ కావడానికి ఆస్కారముంది. ఎట్లా చూసినా మెదక్ జిల్లాలోని చారివూతక ‘కుసలనాడు’ రామ సంబంధ ప్రాంతమే. ఉత్తర భారత సామ్రాట్ సమువూదగుప్తుడు క్రీ.శ. 360 ప్రాంతంలో దక్షిణ దేశాన్నంతటినీ జయించి తిరిగి ఉత్తర భారతానికి ఈ కుశలనాటి నుంచే వెళ్ళినట్లు అలహాబాద్ స్తంభశాసనంలో కూడా ఉంది.

సమువూదగుప్తుడు, అతని కొడుకు చంద్రగుప్తుడు తదితర గుప్తరాజులు శ్రీరామ భక్తులు. శ్రీరామున్ని తమ నాణేలపై ముద్రించారు. తాము జయించిన రాజులు రామ మతాన్ని పోషిస్తే వారి రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చేవారని పి.వి. పరవూబహ్మశాస్త్రి నిరూపించారు కూడా. రెండవ చంద్రగుప్తుని కూతురు, వాకాటక రాజ్యపు రాణి ప్రభావతీ గుప్తతో బంధుత్వమున్న తెలంగాణ రాజు విష్ణుకుండి రెండవ మాధవవర్మ వారి ప్రభావంతోనో లేక తనకు తానుగానో రామభక్తుడై తెలుగు ప్రాంతమంతటా క్రీ.శ. 5వ శతాబ్దంలో రామలింగేశ్వరాలయాలను కట్టించాడు. మూడు, నాలుగు చోట్ల అ విషయాన్ని నిర్ధారించే విధంగా శాసనాలు కూడా దొరికాయి. కాబట్టి, ఎక్కడ ప్రాచీన చారివూతక రామలింగేశ్వరాలయం కనిపించినా దాని మూలాలు కనీసం 5వ శతాబ్దం నుండైనా ఉంటాయని చెప్పవచ్చు.
జానపదులు చెప్పుకుంటున్న స్థలాలు
తెలంగాణలో రాములవారు సంచరించినట్లు స్థానిక జానపదులు చెప్పుకుంటున్న స్థలాలు అనేకం ఉన్నయి. వాటిలో కొన్నింటి ప్రస్తావన...
గోదావరికి ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లాలో మాల్యవంత పర్వతం ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో (అరణ్యకాండ 49వ సర్గ 31వ శ్లోకం) ఉన్నట్లుగానే తదనంతరం కాళిదాసు నకీ.శ. 5వ శతాబ్దం) తన మేఘసందేశంలో (16వ శ్లోకం), ఓరుగల్లు రాజు మొదటి ప్రతాపరువూదుని నకీ.శ. 12 శతాబ్దం) మంత్రి గంగాధరుడు వేయించిన హనుమకొండ శాసనంలో ఉన్నది. ఆ మాల్యవంత పర్వతాలనే ఇప్పుడు నిర్మల కొండలుఅని, ‘సత్మల కొండలుఅని అంటున్నం. ఈ కొండల మీదుగా ప్రయాణించే రాములవారు గోదావరిని దాటి దక్షిణానికి వచ్చాడని చెప్పవచ్చు.

-
రాముడు తన అవతారాన్ని సమాప్తి చేసుకుంటున్న సమయంలో హనుమంతునికి బ్రహ్మపదవిని ప్రసాదిస్తూ దాన్ని సాధించడానికై అతన్ని నిజామాబాద్ జిల్లాలోని లింబావూదిపై తపస్సు చేయుమన్నడట. హనుమంతుడు తపస్సు చేసిండు. అందుకు నిదర్శనంగా మనకు లింబాద్రి గుహాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కుడి పక్కనున్న గుండుకు హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఇదే జిల్లా మోర్తాడ్ మండలంలో గోదావరి తీరాన ఉన్న తడపాకల పరిసరాల్లో కూడా సీతారాములు పర్యటించారని స్థానికులు చెబుతరు. అక్కడున్న శిథిల శివాలయ పరిసరాల్లో సీత చేత పూజలందుకున్నవిగా చెప్పబడే శివలింగాలు కూడా ఉన్నయి.

-
కరీంనగర్ జల్లాలోని రామగుండం దగ్గరున్న రాముని గుండాలఅనే ప్రదేశం చిన్న చిన్న జలపాతాలతో చాలా అందంగా ఉంటుంది. రాముడు ఇక్కడికి సమీపంలో ఉన్నప్పుడే (రామగిరిపై) తన బాణాలను ప్రయోగించి ఇక్కడ గుండాలను సృష్టించాడని అంటరు. గుట్టపై నుంచి ఒక గుండంలో నుంచి నీరు మరో గుండంలోకి దుముకుతూ చివరగా ఒక ఏరై పారుతది. ఈ గుండాల మధ్య క్రీ.శ. 6-7 శతాబ్దాలనాటి అతి ప్రాచీన దేవాలయాలున్నయి. వేములవాడలో కూడా రాముడు పర్యటించాడని స్థల పురాణం చెబుతున్నది. అందుకు నిదర్శనంగా అక్కడి శివాలయంలో శివరాత్రి జరిగినంత ఘనంగా శ్రీరామనవమి కూడా జరుగుతది. ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని మోసుకు పోతున్నప్పుడు ఒక కొండ చరియ విరిగి కింద పడిందట. అదే కొండగట్టుఅని అంటరు. ఇక్కడి ఆంజనేయున్ని పీడనలు తొలగించేవాడిగా భక్తులు పూజిస్తరు.

-
ధర్మపురిలో శ్రీరాముడు ప్రతిష్టంచిన ఇసుకలింగంపై ఆయన చేతి వేలి ముద్రలు కన్పిస్తయని అంటరు. కోటి లింగాలలో రాముడు ప్రతిష్ఠించిన లింగం గుడిలోపల ఉండగా, హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగం గుడి ముందరి ఆవరణలో ఉందని స్థానిక కథనం.

-
మెదక్ జిల్లాలో సంగాడ్డి దగ్గరి కల్పగూరులోని కాశీవిశ్వేశ్వర లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిండని అక్కడి స్థలపురాణం చెబుతున్నది. ఇదే గుడిలోని అనంత పద్మనాభుని విగ్రహంపై ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తయి. శ్రీరాముడిది సూర్యవంశం కావడం గమనార్హం.

-
వరంగల్ జిల్లాలోని రామప్ప, లక్నవరం చెరువుల నీటి వనరులైన వాగులను మొదట రాముడు, లక్ష్మణుడే సృష్టించిండట. కనుక 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ చెరువులకు వారి పేర్లనే పెట్టారని అంటరు.

-
రంగాడ్డి జిల్లాలోని జంటుపల్లి దగ్గర గుట్టలో శ్రీరాముడు రెండు బాణాలను ప్రయోగించి రెండు నీటి వనరులను సృష్టించాడంటరు. ఈ కథనానికి నిదర్శనంగా అక్కడ 12 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో ఉన్న రెండు గాడి దొనల్లో ఎల్లకాలం నీరు కన్పిస్తది. ఇక్కడి శ్రీరాముడి విగ్రహంపైన ఆదిశేషుడు ఉండటం కూడా ఒక ప్రత్యేకత. శ్రీరాముడి పీఠం నుండి కూడా ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటది.

-
శ్రీరాముడు ఆంజనేయునికి కానుకగా ఇచ్చిన హనుమత్‌పుర ప్రాంతంలో శ్రీరామునిచే లఘపాశబంధ శాపానికి గురైన జాబాలిహనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిండని, ఆ విగ్రహాన్ని పూజించి శాపవిముక్తుడైండని కూడా అంటరు. కనుక ఆ ప్రాంతం పేరు పాశబంధపురంఅయిందని చెబుతరు. పాశం అంటే తెలుగులో తాడు కాబట్టి పాశబంధపురమే తెలుగులో తాడుబంద్అయిందనీ అనుకోవచ్చు. ఇది హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి సిక్‌విలేజ్‌ల మధ్య ఉన్నది.
రామ లక్ష్మణులు సీత కోసం అన్వేషిస్తున్న సమయం అది. రాముడు ఒక రాతి మీద కూర్చుని లక్ష్మణునితో ‘‘ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల తరువాత చ్యవనక మహర్షి నా పేరున గుడి కడతాడు’’ అని చెప్పిండట. అదే విధంగా చ్యవనకుడు శివానుక్షిగహంతో కాశీ నుండి పాలరాతి లింగబాణాన్ని తెచ్చి ప్రతిష్ఠించి, దాని చుట్టూ రామలింగేశ్వరాలయాన్ని కట్టించిండట. తుంగభద్రా నదికి 15 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ రామలింగం కోసం ముసలితనంలో చ్యవనకుడు అభిషేక జలం తేలేకపోయిండట. అప్పుడు ఆ నదీ దేవతే ఆ ఆలయం వెనుక ఒక చెరువై వెలసిందట. ఆ చెరువునేచ్యవనకదోనఅంటరు. కాలక్షికమంలో అది చాగదోనఅయింది. అదిప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నది.

-
ఇదే జిల్లా కోయిలకొండకు మొదటిపేరు రామగిరి (1516కు పూర్వం). రాముడు అరణ్యవాసంలో భాగంగా ఈ కొండపై కూడా సంచరించిండని చెప్తూ అందుకు నిదర్శనంగా ఒక రామపాదాన్ని చూపుతరు. అలాగే, నేడు మన్యంకొండగా పిలుస్తున్న కొండ పేరు కూడా ముందు రాములకొండేనట. ఈ కొండపై రాముడు సంచరించిండట.

-
రావణున్ని చంపిన పాపం నుండి విముక్తుడవడానికి రాముడు శ్రీశైల ఉత్తర ద్వారక్షేవూతమైన ఉమామహేశ్వరంలో ప్రదక్షిణ యాత్రను ప్రారంభించి, పంచాంగ నియమాలను పాటిస్తూ శ్రీశైలపు నాలుగు ప్రధాన ద్వార క్షేత్రాలలో ఐదేసి రోజులు ఉపవాస దీక్ష చేశాడట. నాలుగు ఉప ద్వారాలలో మూడేసి రోజుల ఉపవాస దీక్ష చేస్తూ శ్రీశైలాన్ని దర్శించాడనీ అంటారు. ఇదే ఆయన పేర రామ ప్రదక్షిణ పద్ధతిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరొక పద్ధతి అష్టదళ పద్మ ప్రదక్షిణం’. శ్రీశైలానికి ఉన్న అష్టద్వారాలలో నాలుగు (ఉమామహేశ్వరం, ఏలేశ్వరం, అలంపురం, సంగమేశ్వరం) తెలంగాణలోనే ఉండటం గమనార్హం. శ్రీశైలంలో శ్రీరాముడు ప్రదక్షిణానంతరం ప్రతిష్ఠించిన సహవూసలింగంవృద్ధ మల్లికార్జున ఆలయంలో ప్రధాన లింగం వెనుక ఉన్నది. ఇక సీతా ప్రతిష్ఠిత సహస్ర లింగం భ్రమరాంబ ఆలయ సింహద్వారానికి ఎడమ పక్కన ఉన్నది.
శ్రీరాముడు తెలంగాణలో సంచరించాడనడానికే ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నయి. ఏమైనా, జటిల పండితుల విచక్షణ కంటే జానపదుల విశ్వాసానికే బలం ఎక్కువ. కాబట్టి వారు విశ్వసిస్తున్న శ్రీరామ సంచార స్థలాలకు ప్రాధాన్యం తప్పక ఇవ్వవలసిందే!
~ డాద్యావనపల్లి సత్యనారాయణ
94406 7250