Sunday 5 February 2012

Article on Sammakka Sarakka Jatara published in Namaste Telangana on 5-2-2012

సమ్మక్క సారక్కలు దేవతపూలా అయ్యారు?
- డాద్యావనపల్లి సత్యనారాయణ

సమ్మక్క సారక్కలు చారివూతక వ్యక్తులు. మరి, వారు దేవతపూలా అయ్యారుఅనే ప్రశ్నకు సమాధానం వారు ప్రజా సంక్షేమం కోసం పాటు పడడమే అని చెప్పుకోవాలి.
సమ్మక్క ఒక సామంత రాజు భార్య కాగా, సారక్క ఒక స్వతంవూతరాజు కూతురు అని సమకాలీన శాసనాలు, చరివూతను అధ్యయనం చేస్తే వెల్లడవుతుంది. ఈ విషయంలో జానపద సాహిత్యం కూడా కొంత సమాచారాన్ని అందిస్తుంది. వీళ్లు కోయ (గిరిజన) జాతికి చెందిన వారు. వింధ్య పర్వతాలకు దక్షిణంగా వీరు మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పరచుకున్నారు. వీళ్లు మాతృదేవతను, శివుణ్ని కొలిచారు. సమ్మక్క వంశీకులు చందావారు బండిచిక్క వేలుపును కొలిచేవారు. ఆమె తండ్రి రాయిబండాని రాజు వరంగల్ జిల్లా భూపాలపట్నం ప్రాంతానికి రాజు. అతని బావ సమువూదుడు ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లా బీజాపూర్ తాలుకా కొత్తపల్లి ప్రాంతానికి రాజు. వాళ్లది నాగవంశం. వీళ్లకి సంబంధించిన రెండు తెలుగు శాసనాలు కూడా అక్కడ వెలుగుచూశాయి. వాటిని సి.ఎ. పద్మనాభశాస్త్రి ప్రచురించారు కూడా.

రాయిబండాని రాజు తన కూతురు సమ్మక్కను సమువూదుని కొడుకు పగిడిద్ద రాజుకు ఇచ్చి పెండ్లి చేశాడు. ఈ పగిడిద్ద రాజు కరీంనగర్ జిల్లాలో పొలవాస దేశాన్ని పరిపాలిస్తున్న రెండవ మేడరాజు నకీ.శ.1116మకీ.శ. 115) కు కూడా మేనల్లుడు. ఆయన మేడారం ప్రాంతానికి రాజు అయ్యాడు. మేడారం మొదటి పేరు మౌజె మేడారం. పగిడిద్ద రాజు ఇంటి పేరు మజ్జివారు. మౌజెలేదా మజ్జిఅంటే ఊరు అని కూడా అర్థం ఉంది.

ఐతే, ఒక చారివూతక మేడారం కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలో ఉండగా, మరో మేడారం వరంగల్ జిల్లాలో ఉంది. ధర్మారం మండలపు మేడారం దగ్గర మౌజ్జెంపల్లి అనే గ్రామం ఉండడాన్ని బట్టి, అక్కడి పక్క ఊర్లలో మేడరాజు వంశీకులు కట్టించిన దుర్గాలు, ఊర్లు, దేవాలయాలు ఉన్నాయని అర్థమవుతోంది. కాబట్టి, సమ్మక్క భర్త ఇక్కడే రాజ్యం చేశాడని చెప్పాల్సి ఉంటుంది. మేడరాజు, పగిడిద్ద రాజు తదితర స్థానిక రాజుల మీద అనుమకొండ, కాకతీయ రాజు రెండవ ప్రోలుడు క్రీ.శ 113లో ఒకసారి యుద్ధం చేయగా, అతని కొడుకు మొదటి ప్రతాపరువూదుడు 115 లో మరోసారి యుద్ధం చేసి వారిని ఓడించారు. ఓడిపోయిన మేడరాజు తన బిడ్డ సారక్కను ప్రతాపరువూదునికి ఇచ్చి పెండ్లి చేయడానికి నిరాకరించి అందుకు బదులుగా తన పొలవాస దేశాన్ని సంపదను విడిచిపెట్టి అడవులకు పోయాడు. ఈ వివరాలన్నీ హన్మకొండ వేయి స్థంబాల గుడి ముందరి శాసనంలో ఉన్నది.

అలా అతనితో పాటు అతని బంధువర్గం, పగిడిద్ద రాజు కుటుంబం అందరూ ప్రస్తుత వరంగల్ జిల్లా మేడారం -బక్కయ్యపేట ప్రాంతపు అడవుల్లో మరో చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శత్రుశేషం ఉండడం ఇష్టం లేని ప్రతాపరువూదుని సేనలు వారిపై దండయాత్ర చేశాయి. దయ్యాల మడుగు దగ్గర 10 రోజులు యుద్ధం జరిగింది. సమ్మక్క కొడుకు జంపన్న భీకరంగా పోరాడి మరణించాడు. అప్పటి నుండి ఆ వాగుకు జంపన్నవాగుఅని పేరొచ్చింది. ఈ వాగునే సపంన్నవాగు అని కూడా వాడకంలో ఉంది. కాగా, ఇతర రాజులు కూడా మరణించాక సమ్మక్క, సారక్కలు కూడా కాకతీయ సైన్యాలపై వీరోచితంగా పోరాడి మరణించారు.

అలా, తమ ప్రజలను రక్షించడానికై వీరోచితంగా పోరాడి మరణించిన వారిని స్మరించుకోవడానికి వీరగల్ శిల్పాలను చెక్కించడం ఆనాటి ఆనవాయితీ. అలాంటి వీరగల్లులు ఈ కోయరాజుల సమూహంలోని నగునూరు దొమ్మ రాజు (కరీంనగర్ దగ్గర) వీరుల శిల్పాలను, ఆ వీరుల పేర్లను నగునూరులో చూడవచ్చు. అలాంటి వీరగల్లులు ప్రస్తుత మేడారం దగ్గర జంపన్న వాగుపై వంతెన కట్టేందుకు తవ్వుతున్న తవ్వకాలలో బయట పడ్డాయి. అందులో ఒకటి స్త్రీ మూర్తి విగ్రహం సమ్మక్కదే అయ్యుంటుంది. పురుషమూర్తి విగ్రహం జంపన్నది అయ్యింటుంది.

సమ్మక్క సారక్కలు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సమ్మక్క మూలికా వైద్యంలో దిట్ట. తనకు పెళ్లయిన రోజునే ఒక పెళ్లి కొడుక్కి పాము కరిస్తే ఒక మూలిక పసరు పోసి బతికించిందని జానపద సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. సంతానం కావడానికి, దీర్ఘకాలిక మొండి రోగాలు నయం కావడానికి మందులిచ్చేదట. సమ్మక్క వంశపు (చందా వంశపు) ఇంటి కోడలు బుర్రికుంట అనే కుంటను ప్రజల వినియోగార్థం కట్టించిందట. జలకం బావి కూడా అలా కట్టించిందే. మనం దాని ఆనవాళ్లను బయ్యక్కపేటలో చూడవచ్చు. ధర్మారం మండలం మేడారంలో కూడా వారు కట్టించిన చెరువును చూడవచ్చు. చందావంశం వారి ఒకటో గోత్రం కశ్యప. ఈ గోత్రానికి చెందిన దొమ్మ రాజు, ఏడరాజు సోమేశ్వర, నగరేశ్వర తదితర ఆలయాలను కట్టించి, వాటి నిర్వహణకై చేసిన దానాలను, వారి పండిత పోషణను ఇటీవలే ఈ వ్యాసకర్త నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి దగ్గరి గ్రామం గుజ్జల్‌లో దొరికిన శాసనంలో గుర్తించారు. వరంగల్ జిల్లాలోని మేడారం కూడా తాడ్వాయి మండలంలోనే ఉండడం గమనార్హం. ధర్మారం-మేడారం చుట్టు పక్కల సమ్మక్క భర్త పగిడిద్ద రాజు పేరున పగిడిపలి్ల అని మూడు గ్రామాలున్నాయి. వాటిని సమ్మక్క-పగిడిద్ద రాజు కట్టించారనడంలో సందేహం లేదు.
ఈ విధంగా తమ ప్రజలను కంటికి రెప్పలా కాపాడి, వారి సుఖ సంతోషాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన సమ్మక్క సారక్కలు ప్రజల మనసుల్లో దేవతలై కొలువుదీరడం వింతేమీ కాదు. ఇందుకు ఆనాటి సాంస్కృతిక పరిస్థితులు కూడా సహకరించాయి.

వ్యాసకర్త తెలుగు యూనివర్సిటీలో ఆడిటర్. తెలంగాణ సంస్కృతి, చరిత్ర అంశాల పరిశోధకులు.
మొబైల్: 944067250