TELANGANA TOURISM POLICY 2014 By Dr. Dyavanapalli Satyanarayana published in NamastheTelangaana on 19.1.2014
Power point presentation బంగారు తెలంగాణ: టూరిజం
భౌగోళికంగా దక్కను పీఠభూమిలో ప్రధాన భాగం తెలంగాణలోనే ఉంది. కనుక, ఇది సమశీతోష్ణస్థితిని కలిగి ఉంటోంది. మరోవైపు ప్రకతి వనరులకు, సోయగాలకు నెలవై పుష్కలమైన పర్యాటక వనరులనూ మనకందిస్తున్నది. సమద్రాలకు బదులు పెద్ద చారిత్రాత్మకమైన చెరువులు, గోదావరి నదీ జలాలు, ఇసుక తిన్నెలు తెలంగాణలో ఉన్నాయి. తెలుగునేలను ఏలిన 80 శాతం రాజవంశాలు ఈ గడ్డపైనే పుట్టాయి. వారంతా తెలంగాణ పర్యాటకానికి మరింత శోభనిచ్చారు.
ఇలా తెలంగాణ ప్రాంతం అన్ని రకాల పర్యాటకానికి అనువైంది కనుక, ప్రపంచంలోనే అతి వేగంగా వద్ధి చెందుతున్న టూరిజం రంగాన్ని రాబోయే తెలంగాణ ప్రభుత్వం కీలక అభివద్ధి రంగంగా గుర్తించాలి. ఫలితంగా వచ్చే ఆదాయాన్ని పేదరిక నిర్మూలనకు వాడుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ కింది అంశాలు గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2009 సంవత్సరంలో నియమించిన ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ అనే అధ్యయన సంస్థ ఇదే విషయాన్ని ఇలా చెప్పింది.
2020 దాకా ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో 25 శాతం మార్కెట్‌ను దేశీయంగా, విదేశీ పర్యాటకంలో 15 శాతం మార్కెట్‌ను వినియోగించుకోగలిగితే 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక స్థలాలను 61.2 కోట్ల మంది దేశీ పర్యాటకులు, 37.3 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తారని అంచనా.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భూభాగం 42 శాతం కనుక పై అంచనాలతో అంత శాతం అంచనాలను సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దిశగా చర్యలు తీసుకుంటే తెలంగాణలో ఒక్కో జిల్లాకు కనీసం లక్ష ఉద్యోగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరీకరించవచ్చు. ఇందుకు తెలంగాణ 2020 నాటికల్లా 1,30,975 కోట్ల రూపాయలను దశల వారీగా మౌలిక వసతుల కల్పనకోసం ఖర్చు చేయాలని పై అధ్యయన సారాంశం.
-2010 నాటి పర్యాటక విధానం పేర్కొన్నట్లుగా ప్రభుత్వం ముందుగా జిల్లాకొక పర్యాటక అభివద్ధి సమన్వయ మండలిని ఏర్పాటు చేయాలి. ఈ మండళ్ళ ద్వారా ఆయా జిల్లాల్లో ఉన్న కొత్త పర్యాటక వనరులను గుర్తించి వాటి పూర్తి అధ్యయన వివరాలను ప్రచురించి నిపుణుల సాయంతో స్థానిక పర్యావరణాన్ని ప్రజలకు హానీ కలగని రీతిలో మెరుగు పరచాలి.
-వెనుకబడిన ప్రాంతాల ప్రజలు అభివద్ధి చెందేలా పర్యాటక కూడళ్ళను (టూరిజం సర్క్యూట్స్) నిర్ధారించి వాటిల్లో మౌలిక వసతులను అభివద్ధి చేయాలి.
-జిల్లా కొకటి లేదా విశ్వవిద్యాలయానికొకటి చొప్పున పర్యాటక శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పదవ తరగతి ఆ పైన చదువుకొన్న స్థానిక విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పర్యాటక రంగ అవకాశాలను వినియోగించుకోడంలో కావలసిన తర్ఫీదు నివ్వాలి.
-తెలంగాణలోని అన్ని పర్యాటక స్థలాలు, వాటికి అందుబాటులో ఉన్న అన్ని రవాణా సౌకర్యాల వివరాలను, వసతి సౌకర్యాలను సమన్వయ పరచి ప్రత్యేక పుస్తకాలుగా ప్రచురించాలి. వీటిని ప్రజలకు, పర్యాటకులకు ఉచితంగా అందించాలి. ఇవే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి.
-అన్ని రాష్ర్టాల రాజధానుల్లో, విదేశీ రాజధానుల్లో ఉన్న పర్యాటక సౌధాల్లో తెలంగాణ పర్యాటక కార్యాలయాలను ప్రారంభించి, వాటిల్లో పై వివరాల బ్రోచర్లను పర్యాటకులకు ఉచితంగా అందించాలి.
-ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతానికి సమీపంలో ఉన్నదైన, ఆ జిల్లా పర్యాటక వనరులకు, రహదారులకు దగ్గరలో ఉన్న పట్టణాన్ని పర్యాటక కూడలిగా గుర్తించి మౌలిక వసతులతో అభివద్ధి చేయాలి. (ఈ విషయమై జిల్లాకొకటిగా కింది పట్టణాలను గుర్తించవచ్చు. ఆదిలాబాద్‌లో ఉట్నూర్, నిజామాబాద్‌లో సదాశివనగర్, మెదక్‌లో జహీరాబాద్, రంగారెడ్డిలో అనంతగిరి (వికారాబాద్), కరీంనగర్‌లో మంథని, ఖమ్మంలో భద్రాచలం, వరంగల్‌లో ములుగు, నల్లగొండలో సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో ఆలంపూర్ పట్టణాలు) ఆయా జిల్లాల్లో సుమారుగా మధ్యలో నెలకొని పేద ప్రజలకు, పర్యాటక స్థలాలకు (వనరులకు) ఇవి సమీపంలో ఉన్నాయి.
-రాష్ట్ర రాజధాని నుండి, పైన పేర్కొన్న పట్టణాల నుండి అన్ని పర్యాటక స్థలాలకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిటిడిసి), ఆర్టీసీ, క్రమానుగతంగా నియత పర్యటన (కస్టమైజ్డ్ టూర్స్) వాహనాలను నడపాలి. నిరుద్యోగులకు పన్నులు లేకుండా వాహనాలను నడుపుకొనే వెసులుబాటు కల్పించాలి.
-తెలంగాణలో ఉత్తరాన దండకారణ్యం, దక్షిణాన నల్లమల అడవులు ఉన్నాయి. కాబట్టి, పర్యావరణ పర్యాటకాన్ని (ఎకో టూరిజం) అభివద్ధి చేయాలి. గోదావరికి ఉత్తరాన ఉన్న ఆదిలాబాద్, దక్షిణాన ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అడవుల్లోని జలపాతాలకు జలపాత పర్యటనలు (వాటర్ ఫాల్స్ టూర్) నిర్వహించాలి.
-ఆదిలాబాద్‌లోని కెరమెరి, శంకర్ లొద్ది, ఖమ్మం జిల్లాలోని చర్ల ప్రాంతం, మహబూబ్‌నగర్, అక్క మహాదేవి గుహలు మొదలైన స్థలాల్లో కేవ్ టూరిజం అభివద్ధి పరచాలి. ఈ ప్రాంతాల్లో స్థానికులను ట్రెక్కింగ్ గైడులుగా నియమించి వారికే ట్రెక్కింగ్ సైకిళ్ళను కిరాయికి ఇచ్చి ఆ మేరకు హోమ్ స్టేలను ప్రోత్సహించాలి. వారి ఆదాయవద్ధికి కషి చేయాలి.
-ఆదిలాబాద్ జిల్లాలోని తలై, తుమ్మిడి హట్టి, గాడిద గుండం, కనకాయి గూడెం, కొమురం భీం ప్రాజెక్ట్ వంటి ప్రాంతాలను కొత్తగా అభివద్ధి చేయాలి.
-మేడారం జాతరతో పాటు కేస్లాపూర్, గాంధారి ఖిల్లా, మోతెగడ్డ (భద్రాచలం దగ్గర), సలేశ్వరం (మహబూబ్‌నగర్ జిల్లా) మొదలైన గిరిజన జాతరలను ప్రభుత్వ జాతరలుగా గుర్తించి నిర్వహించాలి.
-ఒక్కొక్క జిల్లాలో నెలకు ఒకటి చొప్పున పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలి.
-నిర్మల్, ఖడికి, కేస్లగూడ (ఆదిలాబాద్), కరీంనగర్ (ఫిలిగ్రీ), చేర్యాల (వరంగల్), బొంతుపల్లి (మెదక్), సిద్దిపేట (బాతిక్ చిత్రాలు), గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల చీరెలు మొదలైన హస్తకళలను ప్రోత్సహించడానికై శిక్షణనిచ్చి ఆయా కళాకతులను రాష్ట్ర పర్యాటక స్థలాలన్నింటిలో పర్యాటకులకు అందుబాటులో ఉంచాలి.
~ డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078dyavanapalli@gmail.com

No comments:
Post a Comment