చరిత్ర-పర్యాటకం
'లొంక'లో రామాలయం
'లంక'లో రామాలయం ఉందంటే ఎంత వింతగా ఉంటుందో నిజామాబాద్ జిల్లా 'లొంక'లో ఉన్న రామాలయాన్ని చూస్తే కూడా అంతే వింతైన అనుభూతి కలుగుతుంది.
"ప్రపంచమంతా తిరిగొచ్చాక నా ఇంటి గడప ముందు గాలికి చలిస్తున్న గడ్డిపరక మీది నీటి బిందువును చూసి ప్రపంచపు అందమంతా ఈ బిందువులోనే ఉంది కదా అనుకున్నాను'' అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక కవితలో రాశారు. ఈ కవితను ఆయన సత్యజిత్ రేకు రాసిస్తే ఆయన కూడా గడ్డిపరకలో, నీటి బిందువులో అందాలను చూడడం నేర్చుకుని విశ్వవిఖ్యాతి గాంచిన సినిమాలు తీయగలిగాడు. లొంక రామాలయాన్ని చూశాక మాకు కూడా.. 'అరె ప్రపంచమంతా చూడాలనుకుంటాం. కాని పక్కనే ఉన్న ప్రకృతి అందాలను మాత్రం చూడలేకపోతాం, అలా ఎంతో మిస్ అవుతాం కదా' అనిపించింది.
ఈ 'లొంక' హైదరాబాద్ నుండి కామారెడ్డి, రథాల రామారెడ్డి, తూంపల్లిల మీదుగా వెళ్తే 150 కిలోమీటర్ల దూరంలో సిరికొండ మండలంలో ఉంటుంది. లొంక గురించి కొద్దిగా విని కుతూహలంతో నేను, మా మామయ్య శుభాకర్, తన ఇద్దరు ఫ్రెండ్స్ నరసింహులు, ఆంజనేయులు కలిసి కామారెడ్డి నుంచి కారులో వెళ్ళాం.
ప్రయాణమే ఒక పరవశం
కామారెడ్డి నుంచి 23 కి.మీలు ప్రయాణించాక అడవి ప్రారంభమవుతుంది. ఆ అడవిలో ప్రయాణించడమే ఒక పరవశం. అంత అందంగా ఉంటుంది ఆ మార్గం. చుట్టూ పచ్చని చెట్లు, వాటి మధ్య వంకలు తిరిగే ఇరుకైన దారి, దారికి అటూ ఇటూ గెంతుతున్న కోతులు, కొండెంగలు. ఇంకా నెమళ్ళ సోయగాలు, పక్షుల కిలకిలలు, అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్న ఆదివాసులు... వీటన్నింటినీ వీక్షిస్తూ కన్నుల పండుగగా సాగింది మా ప్రయాణం. పచ్చని అడవుల్లోని ఆ నల్లని (బ్లాక్‌టాప్) రోడ్డు ఒక వంద మీటర్లు కూడా తిన్నగా సాగదు. వంకలు, ఎత్తు పల్లాలతో గమ్మత్తుగా సాగుతుంది ప్రయాణం. తూంపల్లి క్రాస్‌రోడ్ నుంచి ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణించాక ఆదివాసుల ఆరాధ్యదైవమైన చంద్రదేవ్ మహరాజ్ గుడి కనిపిస్తుంది. ఆ ప్రదేశం పేరు బుగ్గతాండ. గుట్టల్లో నుండి పెల్లుబుకుతున్న నీటి బుగ్గ సెలయేరుగా మారి ప్రవహించే ప్రాంతంలో ఈ తాండ-గుడి ఉన్నాయి. అక్కడి నుండి కొండపూర్ వెళ్ళాం.
అత్యంత ఎత్తయిన గుట్ట మీద
'లొంక' కొండాపూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాని మేము ఆ పరిసరాలన్నీ తిరిగి చూడాలన్న ఉద్దేశంతో అక్కడి నుండి కుడివైపుకు తిరిగి తూంపల్లి మీదుగా పాకాల-పందిమడుగు రూట్‌లో ప్రయాణించాం. ఐదు కిలోమీటర్ల తర్వాత గొప్ప దృశ్యం చూశాం. మేము అప్పుడు ఉన్నది జిల్లాలోనే అత్యంత ఎత్తయిన 'రాతిగుట్ట' మీద. అది సముద్ర మట్టానికి 664 మీటర్ల ఎత్తున ఉండడంతో చల్లగాలులు వీచి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తిరుపతి కొండల మీద ఉన్నట్లే అక్కడ ఎదురుకొండ వేంకటేశ్వరాలయం ఉంది. ఎదురుకొండ ఎంత ఎత్తయినదో ఆ కొండ కొన నుంచి కిందికి చూస్తే తెలుస్తుంది. కొండ కింద విశాలమైన లోయ. ఆ లోయలో అక్కడక్కడా విసిరివేయబడ్డట్లున్న పాకలు (ఇళ్ళు), వాటి మధ్య విస్తరించిన పంట చేలల్లో పనిచేస్తున్న ఆదివాసులు, పశువుల కోలాహలం... కాశ్మీర్ లోయను తలపించింది.
లోయలో ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణించి చిమన్‌పెల్లి నుంచి సిరికొండ వైపు తిరిగాక మళ్ళీ అడవి తగులుతుంది. ఈసారి అడవి లోయల్లో, వంకల్లో దిగుడు ప్రయాణం. చుట్టూ ఎన్ని టేకు చెట్లో, ఎన్ని సెలయేళ్ళో. ఏ వంద మీటర్లూ తిన్నగా ప్రయాణం చేయలేము. ప్రతి మూలమలుపులో, దేవతా విగ్రహం దగ్గరా, సెలయేటి దగ్గరా ఆగాలనిపిస్తుంది, ఆడాలనిపిస్తుంది, అడవి అందాలను ఆస్వాదించాలనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. సిరికొండ, హుస్సేన్‌నగర్‌లు దాటి మళ్ళీ అడవిలో కచ్చారోడ్‌పై రెండు కిలోమీటర్లు ప్రయాణించాక 'లొంక' వచ్చింది.
లొంక ఒక లంక
'లంక' అంటే చుట్టూ నీళ్ళు ఉన్న ఒక ప్రదేశం అని కదా. ఈ 'లొంక' చుట్టూ సెలయేరు మాత్రమే కాదు, గుట్టల వరుస కూడా ఉంది. రెండు గుట్టల మధ్య నుంచి వెళ్ళి సెలయేరును దాటినాకే ఈ 'లొంక' లోయను చేరుకుంటాం. వాస్తు ప్రకారం కట్టారేమో అన్నట్లుగా లొంకకు దక్షిణ, పశ్చిమాలలో చాలా ఎత్తయిన గుట్టలున్నాయి. ఉత్తరం వైపు ఇనుపరాళ్ళ గుట్టలు ఉంటే, తూర్పు వైపు మామూలు రాళ్ళగుట్టలు ఉన్నాయి. ఆ ఎత్తయిన గుట్టల్లో పుట్టి రామాలయాన్ని చుట్టి జలజలా పారుతున్న సెలయేరులో మూడు నాలుగు కిలోమీటర్లు హ్యాపీగా ట్రెక్కింగ్ చేయవచ్చు. చెట్లమీద గుడ్లగూబలు, చెట్ల కింద చిట్టి ఉడతల సయ్యాటలు, చెట్ల మధ్య కోతుల గెంతులను మన కెమెరాల్లో బంధించుకోవచ్చు. మరీ లోపలికి వెళ్తే మాత్రం ప్రమాదమట. కారణం సెలయేటి నీటిని తాగడానికి క్రూరమృగాలు కూడా వస్తుంటాయట. ఆఫ్‌కోర్స్ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మాత్రం అడవులు, గుట్టల మీదుగానే ఇక్కడికి వస్తుంటారు. వారి అనుభవం, అవగాహనలు వేరు.
చెట్టు ముందా, వేరు ముందా?
ఆలయానికి ఈశాన్యంలో ఉన్న విశాలమైన స్థలంలో రెండు వింత వృక్ష సమూహాలున్నాయి. ఒకటి- మఱ్ఱి చెట్టు ఏపుగా పెరిగి పెద్ద ఊడను జారేసింది. ఆ మఱ్ఱి కాండము, ఊడ ఒకే సైజులో ఉన్నా యి. ఏది ఊడో, ఏది కాండమో ఎంత గింజుకున్నా గుర్తుపట్టలేము. ఇక రెండవ వృక్షంలో మఱ్ఱి, జువ్వి, చింతచెట్లు పెనవేసుకుని ఉన్నా యి. ఏది ముందు పుట్టి రెండోదానికి ఆశ్రయమిచ్చిందో చెప్పలేము.
గుహ గుడిగా, గుడి గుండంగా...
అన్ని దేవాలయాల్లోనూ ఈశాన్యంలో కోనేరుంటే ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా నైరుతిలో ఉంది కోనేరు. అయితే ఆ కోనేరుకు దేవాలయం కుడివైపు నుండి వెళ్ళి కాళ్ళు చేతులు, ముఖం కడుక్కుని ఎడమవైపు నుంచి తిరిగి రావడంతో మనకు తెలియకుండానే దేవాలయానికి ప్రదక్షిణ చేసినట్లవుతుంది. నిజానికి ఆ కోనేరు గుండం మొదట ఒక గుహ. గుట్టల్లోనుంచి వడివడిగా వస్తున్న సెలయేరు ఒక పెద్ద గుండు మీద నుంచి చిన్న వాటర్‌ఫాల్స్ లాగా దుముకగా దాని తాకిడికి గుండు కిందుగా గుహ ఏర్పడింది. ఆ గుహలో క్రీ.శ. 5వ శతాబ్దంలో విష్ణుకుండిన రాజులు తమ ఇష్టదైవమైన రాముడిని, రామలింగాన్ని (అక్కడివాళ్లు శివలింగాన్ని ఇలా పిలుస్తారు) చెక్కించి గుహ పైభాగంలో (అంటే గుండు మీద) శంఖు చక్రాలను, రామ పాదాలను, విష్ణు నామాలను చెక్కించారు.
ఇప్పుడా రాముని విగ్రహాన్ని గుహ/గుండం నైరుతి మూలలో, లక్ష్మణ, సీత, రామలింగాన్ని గుండం గోడకు వాయవ్య మూలలో చూడవచ్చు. రామబంటు ఆంజనేయుని విగ్రహం గుండం మీద ఆగ్నేయ మూలలో ఉంది. గుండం ఈశాన్యపు ఒడ్డున గల ఒక రాయిపై వినాయకుని విగ్రహం చెక్కి ఉంది. ఆ విగ్రహానికి కిరీటం, జందెం ఉండడం, కింద ఎలుక లేకపోవడం బట్టి అది చాలా ప్రాచీనమైనదిగా భావించవచ్చు. విష్ణుకుండిన రాజులు తమ శాసనాల్లో "శ్రీపర్వతస్వామి పాదాలను, దంతముఖస్వామిని (వినాయకుణ్ణి) ధ్యానించేవాళ్ళము'' అని చెప్పుకున్న మాటలకు నిదర్శనంగా మనం ఇక్కడ సిరికొండ (శ్రీపర్వతం) పక్కనే స్వామి పాదాలను, వినాయకుణ్ణి చూడవచ్చు. స్థానికులు ఈ ప్రాంతాన్ని రాముడు నడిచిన ప్రాంతంగా భావిస్తారు కాబట్టే అందుకు నిదర్శనంగా ప్రక్కనే రామడుగు (రామ+అడుగు) అనే గ్రామం కనిపిస్తుంది. సహజమైన రాయి మీద శేషశయనమూర్తిని చెక్కించడం విష్ణుకుండినుల ప్రత్యేకత. అలాంటి విగ్రహం సిరికొండలో ఉంది.
విష్ణుకుండినుల సాంప్రదాయాలచే ప్రభావితులైన తొలి చాళుక్యులే (క్రీ.శ. 6,8 శతాబ్దాలు) ఇక్కడి గుహాలయాన్ని గుండంగా మార్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఆలయంలో గర్భగృహాన్ని మొదట వారే కట్టించి లింగాన్ని ప్రతిష్ఠించి ఉండొచ్చు.
గర్భగుడి పైకప్పు లోపలి భాగాన మాత్రం జైన శైలీ ప్రభావంతో చెక్కిన పంచ వలయాల (కలశ) చిహ్నం కనిపిస్తుంది. బహుశా ఆది జైన మతానుయాయులైన బోధన్ చాళుక్యుల (క్రీ.శ. 8-10 శతాబ్దాలు) అనంతరం అధికారంలోకి వచ్చిన మలి చాళుక్యులు (క్రీ.శ. 10-12 శతాబ్దాలు) తమ పూర్వం రాజుల వాస్తుశైలి నుండి బయటపడక ముందు చెక్కించిన చిహ్నం అయ్యుంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం కనిపిస్తున్న రామాలయపు గర్భగుడి చివరిసారిగా 10వ శతాబ్దంలో కట్టించబడింది అనుకోవాలి. అదే కాలంలో ఆలయంలో ప్రస్తుతమున్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆలయానికి వాయవ్యంలో ఉన్న భైరవుడు, వీరభద్రుని విగ్రహం కూడా అదే కాలానిది.
బహుశా అది జైన మత విధ్వంసానికి పాల్పడిన వీరశైవ మతస్థుల చేత ప్రతిష్ఠించబడినదై ఉంటుంది. కారణం, దాని ముందు జైన మత శైలిలో చెక్కిన చక్ర కలశం పడి ఉండడం. దీని నేపథ్యాన్ని తెలియజేసే ఒక దీర్ఘ శాసనాన్ని మలి చాళుక్యులు గుహ/గుండం పైన చెక్కించారు. కాని దాని ప్రాముఖ్యత తెలియక ప్రజలు దాన్ని శతాబ్దాలుగా తొక్కుతుండడంతో అరిగిపోయింది. ఇలా వేయిన్నర సంవత్సరాల చరిత్ర కలిగి, అంతకుమించిన అటవీ సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఈ లొంక రామాలయం ఎకో టూరిజం ఇష్టపడేవారికి ఒక వరం. ఈ ప్రాధాన్యాన్ని గుర్తిస్తే రాష్ట్ర పర్యాటక శాఖ ప్రమోట్ చేస్తున్న పర్యాటక స్థలాల్లో ఇది ఒక మణిపూస కాగలదు.
- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
సెల్ : 94406 87250,
dyavanapalli@gmail.com

No comments:
Post a Comment