నట్టడవి నడుమ గుండాల జలపాతం
ఏ కొద్దిగా పర్యాటక పరిజ్ఞానం ఉన్నవారినైనా ‘మన రాష్ట్రంలో అతి పెద్ద వాటర్ ఫాల్స్ ఏది?’ అని అడిగితే వారు ఇంతవరకు చెప్తున్న సమాధానం ‘కుంటల వాటర్‌ఫాల్స్’. మనం ఇక మీదట మన సమాధానాన్ని మార్చుకొని ‘గుండాల వాటర్ ఫాల్స్’ అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే, కుంటల వాటర్‌ఫాల్స్ ఎత్తు 46 మీటర్లు కాగా గుండాల వాటర్ ఫాల్స్ ఎత్తు ఇంక వంద మీటర్లు ఎక్కువగా ఉంటుంది. అంటే కుంటల వాటర్ ఫాల్స్ కంటే గుండాల కూడా కుంటల వాటర్ ఫాల్స్ ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనే తిర్యాని మండలం మాన్కాపూర్ గ్రామ పరిధిలో ఉంది.
గుండాలకు వెళ్లటం ఒక సాహసం. ఇది ఎతె్తైన సత్మల పర్వత సానువులను ఎక్కాక నట్టనడిమి అడవిలో ఉంది. ఇక్కడికి రోడ్లుండవు. కాలినడకే శరణ్యం. కవ్వాల అభయారణ్యంలో భాగమైన ఈ గుండాలకు అటవీ మార్గంలో ఎలా పోవాలో కూడా తెలియదు కాబట్టి గుండాల మాజీ ఎపీటీసీ మోతేరామ్ పటేల్‌ను, సమీప హామ్లెట్ మాజీ ఉపసర్పంచ్ నర్సయ్య పటేల్‌ను తీసుకెళ్లాం.
హైదరాబాద్ నుండి కరీంనగర్, చొప్పదండిల మీదుగా 225 కి.మీ.లు ప్రయాణించాక వచ్చే లక్సెట్టిపేట చౌరస్తా నుండి 16 కి.మీ.ల దూరంలో వచ్చే దండెపల్లి మండల కేంద్రం నుండి ఆటోలో 9 కి.మీ.లు ప్రయాణించి, ఊట్ల అనే నాయకపోడ్ గూడెం చేరుకొని, అక్కడి నుండి 6 కి.మీ.లు ట్రెక్కింగ్ చేసి ఈ గుండాల వాటర్ ఫాల్స్‌ను చేరుకోవచ్చు.
ఊట్ల గుట్టపై మలుపులు.. మజిలీలు
ట్రెక్కింగ్ ప్రారంభం ‘ఊట్ల’ అనే ఏరు నుండి. ఈ ఏటి నీరే సమీప ఊట్ల గ్రామానికి తాగునీటికి, సాగునీటికి ఆధారం. ఈ ఏరు పరిసరాలు ఎతె్తైన పచ్చని, చిక్కని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడున్న అడవి మామిడి వనం స్థానికులకు, పిక్నిక్‌లకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు తియ్యని పళ్లను కూడా అందిస్తాయి ఉచితంగా. సమీపంలోని పెద్దయ్యగుట్ట, భీమన్న దేవర దర్శనాలకు వచ్చేవారు కూడా ఈ ఏరు పరిసరాల్లో సేదదీరుతారు.
ఊట్లలోని సహజమైన, స్వచ్ఛమైన నీటిని బాటిళ్లలో నింపుకుని ఊత్తరం వైపునున్న ఊట్ల గుట్టపైకి ట్రెక్కింగ్ ప్రారంభించాలి. ఈ గుట్ట సుమారుగా 400 మీటర్ల ఎత్తుంటుంది. ఈ ఎత్తును ఏడు మలుపుల్లో ఒక్కో మలుపునకు సుమారు 50 మీటర్ల చొప్పున ఎక్కాలి. ఈ మలుపులను సుమారుగా నిటారుగానే ఎక్కాలి కాబట్టి తప్పకుండా ఆయాసమొస్తుంది. అయితే ఆ అలసటను తొలగించుకోవటానికి మలుపు మలుపు దగ్గర మజిలీలుంటాయి.. అంటే చెట్ల నీడల కింద బండ పరుపులన్నమాట. పచ్చని చెట్ల పైనుండి వీస్తున్న చల్లని గాలులు పర్యాటకులకు ఇచ్చే హాయిని పక్షుల రావాల మధ్య అనుభవించాల్సిందే కాని అభివర్ణించలేం. తడారిన గొంతులను తడుపుకోవడంలో ఉండే తన్మయత్వం కూడా చెప్పలేం.
ఇలా మజిలీ మజిలీలో ఎంజాయ్ చేస్తూ ఏడు మూల మలుపులను ఎక్కిన తరువాత ‘అరె ఇంత ఎత్తు మనమే ఎక్కామా?’ అని ఆశ్చర్యపోతాం. ఈ ఏడు మూల మలుపులకు స్థానిక గిరిజనులు (నాయకపోడ్, రాజ్‌గోండ్) ఏడు పేర్లు పెట్టుకున్నారు. మొదటి మలుపు పేరు తొలి మలుపు, మరో మలుపు పేరు తానిచెట్టు మలుపు, ఇంకొక మలుపు పేరు తేటి మలుపు.. ఇలా. ఈ ఏడు మలుపులను వారు నాన్‌స్టాప్‌గా కేవలం పదిహేను నిమిషాల్లోనే ఎక్కుతారట. ఇది వారికి నిత్యకృత్యం - రోడ్లు లేవు కాబట్టి. సుమారు వందేళ్ల క్రితం సిర్‌పూర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కాగితం మిల్లుకు ఇక్కడి అడవుల నుంచి కంక బొంగు రవాణా అయ్యేదట. ఆ కాలంలో లారీలు తిరగటానికి ఈ గుట్టపై ఏడు మలుపులతో కచ్చా రోడ్‌ను ఏర్పాటు చేశారు. కాని సుమారు యాభై ఏళ్ల కిందట ఇక్కడ బొంగు కొట్టడం ఆగిపోయింది కాబట్టి ఆ కచ్చా రోడ్డు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది. ఐతే గత దశాబ్ద కాలంలో ఇక్కడ పక్కా రోడ్డు వేయడానికి ఒకసారి 4 కోట్లు, మరోసారి 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయట. కాని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఇక్కడి కవ్వాల అభయారణ్యంలో తిరిగే జంతువులకు ఆ రోడ్డు వల్ల హాని కలుగుతుందని అభ్యంతరం తెలిపారని నర్సయ్య పటేల్ చెప్పాడు. ఇక మీదట కూడా ఆ రోడ్డువేసే అవకాశమే లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్ జోన్‌గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించింది. కాబట్టి కొద్దికాలంలో గుండాల ఊరినే లేపేస్తారట. ఆ ఊరి రాజ్‌గోండులేమో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
అడవి అందాలు
ఆరవ మూల మలుపు ఎక్కిన తరువాత వెనక్కి తిరిగి చూస్తే ‘వావ్’ అని అరవకుండా ఉండలేం. కారణం అక్కడి నుండి చూస్తే కొండ కోనలు లోయల మధ్య విస్తరించిన పచ్చని చెట్లే కాకుండా వాటి మధ్య పారే ఏరులు కూడా తమ అందాలతో కనువిందు చేస్తాయి. ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దులను నిర్ణయిస్తూ పారుతున్న గోదావరి సోయగాలను తనివితీరా చూడాలనుకుంటే అది ఈ ఆరవ మూల మలుపు నుంచే సాధ్యం. మనం కొండల మీద ఉంటాము కాబట్టి కింద పరచుకున్న విశాల భూభాగంలో పల్లెలు, గిరిజన గూడేలు, వాటి మధ్యనున్న చెరువులు - అన్నీ ఎంతో అందంగా కన్పిస్తాయి.
జన సంచారం లేని ఆ అడవుల్లో జంతు సంచారమైతే ఉంటుందట. పిల్ల తల్లులైన ఎలుగుబంట్లు, అడవి పందులైతే మనపై అటాక్ చేస్తాయి కూడా. అయినా ఒకరిద్దరు నాయకపోడ్ పిల్ల తల్లులు ఏడవ మూల మలుపు దగ్గర కంక బొంగులను కొట్టుకొచ్చుకొని వాటి ఈనెలతో తడకలు అల్లుతున్నారు. పాలుతాగే తమ పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి వచ్చి పొద్దంతా ఈ పని చేసి ఆ తడకలను సమీపంలోని ఊర్లలో అమ్మగా వారికి ఒక్కొక్కరికి వచ్చేవి 150 నుండి 200 రూపాయలట. ఇదంతా కూడా దొంగతనం చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు చూస్తే పట్టుకుంటారు. ‘మరి ఎందుకమ్మా పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు?’ అనడిగితే, ‘ఏం చేయమంటరు సారు! మా మొగోళ్లు తాగి తందనాలాడుడే తప్ప రూపాయి సంపాయించరు కదా! ఇల్లెట్ల గడువాలె?’ అని ఎదురు ప్రశ్నించారు. సమాధానం చెప్పే శక్తి లేక ముందుకు నడిచాం.
ఏడవ మూల మలుపు ముగిసేచోట ఒక రాతి గద్దెపై ఒక మూరెడెత్తు రాయి నిలబెట్టి ఉంది. దాన్ని స్థానిక గూడేల గిరిజనులు నల్లపోచమ్మగా పూజిస్తారట. ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి, పాల కాయలు (కొబ్బరికాయలు) కొట్టి, కోళ్లు, గొర్రెలు మేకలను కోసుకొని పొద్దంతా దావతు (పార్టీ) చేసుకుంటార్ట. ఈ నల్లపోచమ్మ దగ్గరే నాలుగు దారుల కూడలి ఉంటుంది. ఉత్తరం వైపు వెళ్లేది గుండాలకు వెళ్తే ఈశాన్యం వైపు వెళ్లేది వీరన్న మడుగుకు వెళుతుంది. ఆ ప్రాంతపు అడవిలో అదొక్కటే నీటి వనరు కావడంతో అక్కడికి క్రూర జంతువులు కూడా వస్తాయి. అయినా మేము గుత్పలు (రాడ్‌ల వంటి కర్రలు) పట్టుకొని ఆ వీరన్నకుంట దగ్గరికి వెళ్లాం. ‘మనిషే అన్ని క్రూర జంతువుల కంటే క్రూరమైన జంతువు. కాబట్టి మన అలికిడి (శబ్దం) వినగానే అవి పారిపోతాయి’ అని నర్సయ్య పటేల్ అభయమిచ్చి తీసుకెళ్లాడు. వీరన్న గుడి మధ్యయుగాల్లో ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలించిన గోండు రాజుల నిర్మాణంగా కనిపించింది. పొడవాటి చెట్ల కొమ్మల మధ్య నుండి చొచ్చుకువచ్చి వీరన్న కుంటలో మిలమిలా ప్రతిబింబిస్తున్న సూర్యకిరణాల అందాలను చూసి తీరాల్సిందే.
వీరన్నకుంట నుంచి సుమారు ఒక కిలోమీటరు ఉత్తరం వైపు నడిచాక గుట్టబోర్ల మధ్యనున్న మైదానం కనిపిస్తుంది. ఈ మైదానం రానురాను విస్తరిస్తున్నది. కారణం, డ్వాక్రా, ఇందిరమ్మ తదితర ప్రభుత్వ పథకాల కింద ఈ అటవీ భూములను లబ్ధిదారులకు అసైన్ చేయడంతో వారు అడవులను నరికి సాగు చేసుకుంటున్నారు. అలా డీఫారెస్టేషన్ పెరిగి పర్యావరణానికి విఘాతం కలుగుతున్నదని ఎవరు చెప్పాలి? ఇక్కడే పశువులను, గొర్రెలను మేకలను పొద్దంతా అడవుల్లో మేపి రాత్రి ఒక కంచె కట్టి వాటిని అందులో ఉంచే ఏర్పాట్లున్నాయి. వాటి దగ్గరికి చిరుతలు, పులులు, తోడేళ్లు రాకుండా రాత్రంతా కాలేటట్లు ఒక పెద్ద చెట్టు మొద్దును అంటపెడతారు. ఇలా కారణాలు ఏవైనా ఫలితం ఒక్కటే.. డీఫారెస్టేషన్.
ఈ మైదానం మొదట్లో నిలబడి ఉత్తరం వైపు చూస్తే చిన్నచిన్న గుట్ట బోర్ల మొదట్లో అక్కడక్కడ అర్ధచంద్రాకారంలో పరచుకున్న ఆరేడు గోండు గూడేలు కన్పిస్తాయి. తడికల గోడల మీదనే బెంగుళూరు గూనను కప్పడం గోండులు ఈ మధ్య నేర్చుకున్నట్లు స్పష్టమవుతుంది. ఒక్కొక్క గూడెంలో ఉండే ప్రముఖ గోండు పెద్దను బట్టి ఆ గూడేన్ని ఆయన పేరుతో పిలుస్తారు. అలా మనకు లచ్చుపటేల్ గూడెం, మోతేరాం పటేల్ గూడెం, గుడిగూడెం అనే పేర్లు విన్పిస్తాయి. ఇక్కడికి దగ్గరలో మర్లవాయిలో నివసించిన ఆస్ట్రియన్ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 1940ల నుంచి 1990ల వరకు చేసిన ప్రచారం, కృషి పుణ్యమాని రాజ్‌గోండులు ఆహార సేకరణ, పోడు వ్యవసాయ పద్ధతులను వదిలి స్థానిక ఏరులకు అడ్డంగా ఆనకట్టలు కట్టి చెరువుల నేర్పరచుకొని వ్యవసాయం చేస్తున్నారు.
పరుపు బండల మీద వ్యవసాయం
పర్వత సానువుల మీద చదునైన భూములెట్లా ఉంటాయి? ఉండవు. అయితే ఇక్కడ 120 ఎకరాల మేర పరుపు బండలు విస్తరించాయి. హైమన్ డార్ఫ్‌కు వచ్చిన ఆలోచనో, మరెవరికి వచ్చిన ఆలోచనో గాని ఇక్కడి రాజ్‌గోండులు ఆ బండల మీదే వ్యవసాయం చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. అదేంటంటే, వర్షాలు రావడానికి ముందు సుమారు అర ఎకరానికి ఒక ఏటవాలు ఆనకట్ట కడతారు. వర్షాల వరదలకు గుట్టల నుండి మట్టి కొట్టుకొచ్చి ఆ ఆనకట్ట లెవల్‌లో (ఒకటి నుంచి రెండు ఫీట్ల ఎత్తు) పేరుకుపోతుంది. ఆ పోల్ మట్టిలో రాళ్లు ఏవైనా ఉంటే ఏరి చిన్నచిన్న మడులుగా చేసుకొని ఆ మడులలో వ్యవసాయం చేస్తారు. అవసరమే ఆవిష్కరణలకు మూలం అనడానికి ఇదొక నిదర్శనం. అయితే ఈ భూములకు నీటి వనరైన చెరువును కట్టించింది మాత్రం బాజీరావు అనే గోండు ప్రముఖుడట. ఆయన గుండాలలో ఆగ్నేయంలో ఉన్న గుడి గూడెం పై నుండి పారే ఒక వాగుకు అడ్డంగా ఈ చెరువును కట్టి దాని కింది భూములను స్థానిక రాజ్‌గోండులందరికీ సమానంగా పంచాడట. అయితే ఈ చెరువు కట్టడం వల్ల వర్షాకాలం తరువాత చెరువు నుంచి వచ్చే అలుగు తగ్గిపోయి నవంబర్ తరువాత వాటర్‌ఫాల్స్ దుముకకుండా పోతుంది. బాజీరావు సమాధిని ఇప్పుడు గుడిలాగా పూజిస్తున్నారు.
వాటర్‌ఫాల్స్ వాగులో వాకింగ్..
పరుపుబండల పొలాల తూర్పు నుండి సుమారు కిలోమీటరున్నర దూరం ప్రయాణించే అలుగు వాగు సడన్‌గా ఈశాన్యం మూలలో ఒక గుట్ట అడ్డుపడటంతో పడమర వైపుకి తిరిగి పారుతుంది. ఒక ఫర్లాంగు దూరం తరువాత 25 ఫీట్ల ఎత్తు నుండి దుమికి మనకు మొదటి వాటర్‌ఫాల్స్‌లాగా దర్శనమిస్తుంది. ఇక ఇక్కడి నుండి అర్ధచంద్రాకారంలో వాయవ్యం మీదుగా ఉత్తరం వైపు తిరిగి పారుతుంది. సుమారు ఒక కిలోమీటరు దూరం. ఈ అర్ధచంద్రాకార పారకం ఒక అద్భుతం. ఎందుకంటే, ఈ ప్రవాహ మార్గం పది గజాల ఎత్తు/లోతు, పది గజాల వెడల్పుతో రాతిని కట్ చేసి ఏర్పరచినట్లుంటుంది. ఇందులో జలజల పారే వాగులో గంతులేసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ సరదాగా సాగే పదిహేను నిమిషాల నడక జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతినిస్తుంది.
ఒక ఫర్లాంగు దూరం ఇలా నడిచాక ఈ వాగు పది అడుగుల ఎత్తు నుండి దుముకుతూ రెండవ జలపాతంలా దర్శనమిస్తుంది. ఈ జలపాతం కింద ఒక అద్భుతమైన బట్ ప్రమాదకరమైన గుండం కనిపిస్తుంది. పేరు సవతుల గుండం. ఈ గుండం సాలిడ్ రాక్‌లో ఎంత లోతు వరకు ఉందంటే.. ఈ గుండం నీటిలో రాయి వేసినప్పుడు అది సుమారు వంద సెకన్లు ప్రయాణించి అడుగుకు చేరుకున్నట్లు బుడగలను పైకి పంపింది. వాగు ఎండిపోయినా ఈ గుండం మాత్రం ఎండాకాలం కూడా ఎండిపోదట. ఇక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి ఎన్నో జంతువులు కాలు జారిపడి చనిపోయాయట. అలాగే ఇద్దరు సవతులు ఇక్కడ పేలు చూసుకుంటూ ఒకర్నొకరు లాక్కొని ఇందులో పడి చనిపోయారట. కాబట్టే దీనికి సవతుల గుండం అని పేరు అని మోతేరాం పటేల్ చెప్పాడు.
అత్యంత ఎతె్తైన వాటర్ ఫాల్స్
అలుగు వాగు ఉత్తరాభిముఖంగా పది మీటర్ల వెడల్పులో సుమారు 150 మీటర్ల ఎత్తు పైనుండి నిటారుగా దూకడంతో రాష్ట్రంలో అత్యంత ఎతె్తైన గుండాల వాటర్‌ఫాల్స్ ఆవిష్కృతమైంది. పది ఇరవై మీటర్ల ఎత్తు నుండి దూకే వాటర్‌ఫాల్స్‌ను చూసే ఆనందించే పర్యాటకులకు ఇంత ఎతె్తైన, అరుదైన గుండాల వాటర్‌ఫాల్స్‌ను చూస్తే ఎంతటి ఆనంద హర్షాతిరేకాలకు గురవుతారో ఊహించుకోవచ్చు. 90 డిగ్రీల లంబ కోణంలో ఈ వాటర్‌ఫాల్స్ దుముకడంతో దీని అందం మరింత ఇనుమడించింది. అయితే ఈ వాటర్ ఫాల్స్ అంత ఎత్తు నుంచి ఒక బండ పరుపుపై దుముకడంతో ఆ వాటర్‌లో వచ్చే చేపలు చచ్చిపోతున్నాయట. ఇంత ఎత్తు నుంచి దుమికే వాటర్ ఫాల్స్ మంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణానికి అనుకూలిస్తుందని రాష్ట్ర ఇంజనీర్లు వచ్చి చూశారట. ఐతే వర్షాకాలం తప్ప ఈ వాటర్ ఫాల్స్ దుముకకపోవడంతో అంత ప్రయోజనకరం కాదని వదిలేశారట. మేం వెళ్లిన ఫిబ్రవరిలో కూడా ఈ వాటర్‌ఫాల్స్ దుముకకపోవడం మాకు వొకింత నిరాశనే కలిగించింది.
వ్యూపాయింట్
అయితే ఈ వాటర్‌ఫాల్స్ పరిసరాలు గొప్ప వ్యూ పాయింట్ కావడం వల్ల మా సాహస యాత్రకు సార్ధకత చేకూరినట్లే. వాటర్‌ఫాల్స్ వాగులో అది కిందికి దుమికే పాయింట్ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుండి కిందికి చూస్తే కళ్లు తిరుగుతాయి. అయినా నిబాయించుకుని చూస్తే వాటర్‌ఫాల్స్ పడిన చోట పెద్ద గుండం ఏర్పడింది. ఏపుగా పెరిగిన చెట్ల మధ్య నుండి ఇది కనిపిస్తుంది. చెట్ల పచ్చదనం ఆ గుండం నీళ్లల్లో ప్రతిఫలించి ఆ నీళ్లు కూడా పచ్చగానే కన్పిస్తాయి. వాగు వాటర్‌ఫాల్స్‌గా మారే చోట ఎడమ వైపున ఒక గుహ ఉంది. అందులో సుమారు ఇరవై మంది కూర్చోవచ్చు. ఆ గుహలో నిల్చుని పడమర నుండి ఉత్తరం మీదుగా తూర్పు దిక్కు వరకు ఎటు చూసినా ఎతె్తైన కొండలు, పచ్చని చెట్లతో చిక్కగా అలంకరించబడి కన్పిస్తాయి. వాటిపై నుండి వచ్చే ఈదురు గాలిని ఆస్వాదిస్తూ ఆదమరిచి వాటర్‌ఫాల్స్ కింద పడిపోతామేమో అనిపిస్తుంది.
వాటర్‌ఫాల్స్ కింది గుండాన్ని నాలుగు దిక్కులా నాలుగు పర్వత శ్రేణులు చుట్టుముట్టాయి. ఒక్క వాయవ్య మూలలోనే ఒక ఇరుకు సందు ఉండటంతో ఈ గుండంలోని నీరు ఆ సందు గుండా పారిపోతున్నది - దొంగలా ఎవరికీ కనపడకుండా. ఈ గుండం దగ్గరికి చేరుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడికి చేరుకోవడం అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడికి పశ్చిమం వైపు నుండి గాని, తూర్పు వైపు లోయ నుండి గాని చేరుకోవచ్చు. ఒక్కొక్క రాయిని జాగ్రత్తగా దాటుకుంటూ గుండం దగ్గరికి చేరుకున్నాక గుండె బరువంతా దిగిపోతుంది - ఆ గుండం పరిసరాల అందాలను చూసి.
చుట్టూ ముసురుకున్న గుట్టల మధ్య కేవలం 150 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు/లోతు కొలతలతో ఒక బావిని తవ్వితే ఆ బావి అడుగున నీరు ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది ఈ గుండం. అంత ఇరుకుగా ఉంటుంది కాబట్టి అక్కడ అరుస్తే ప్రతిధ్వనులు పదింతలు రెట్టింపయి మార్మోగుతాయి. మన కేరింతలకు తోడు పక్షులు చేసే కిలకిలలు.. పరవశించో, పరవశింపజేయడానికో, పారిపోతూనో.. మనల్ని పరవశింపజేస్తాయి. ఇలా ఆనందిస్తూ అక్కడ నిద్రాహారాలు మరిచి కూడా ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. ఈ గుండానికి ఉత్తరాన ఫర్లాంగు దూరంలో మరో వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడికి ఇరుకైన వాగు ప్రవాహంలో వాకింగ్ చేయటం ఎంతో బావుంటుంది. కాని ఈ గుండం ప్రాంతం అరుదైన నీటి వనరు కాబట్టి అక్కడికి క్రూర జంతువులు వస్తాయి. కనుక పొద్దుగుంకక ముందే అక్కడి నుండి బయలుదేరవలసి ఉంటుంది.
ఎలుగు దొనలు, తేనె తుట్టెలు
ఈ వాటర్‌ఫాల్స్ పరిసరాల్లోని వ్యూపాయింట్‌ను కెమెరాలో బంధించడం అంత ఈజీగా సాధ్యపడదు. అయినా ప్రయత్నిస్తే అలా అలా నడుస్తూ వాటర్‌ఫాల్స్‌కు కుడివైపున రాళ్లపైకి వెళ్లి ఫొటోలు తీస్తుంటే మోతేరాం పటేల్ త్వరగా అక్కడ్నుంచి రమ్మని కేకలు వేశాడు. వచ్చి అడిగితే నేను ఎక్కిన రాళ్ల కింద దొనలో రెండు ఎలుగు బంట్లున్నాయని చెప్పాడు. ‘బతుకుజీవుడా’ అనుకున్నాను. కాని స్థానిక గిరిజనులు మాత్రం ఆ ఎలుగు దొన కింద ఇరుకు సందులో ఉన్న అరుదైన ఖండోరా చెట్ల చెక్కను ఏ భయమూ లేకుండా సేకరిస్తారట. ఆ చెక్క ఎటువంటి నొప్పులు, గాయాలనైనా అతి కొద్ది రోజుల్లోనే మానే్పస్తుందట. నిటారుగా ఉన్న వాటర్‌ఫాల్స్ బండకు పైన తాడు కట్టుకొని లోయలో వేలాడుతూ కొలాము గిరిజనులు ఆ బండకు పెట్టిన తేనె తుట్టెల నుండి తేనె తీస్తారట. పొరపాటున తాడు తెగినా, ఊడినా 150 మీటర్ల లోయలో పడిపోవడమే. ఊహే భయంకరంగా ఉంటుంది.
ఇలా సాహసాలకు నిలయమైన గుండాల వాటర్ ఫాల్స్‌ను సాహస యాత్రికులు సందర్శించవలసిందే. ప్రభుత్వం పట్టించుకుంటే ఇది అద్భుతమైన ఎకో టూరిస్ట్ స్పాట్ అవుతుంది.
-డా.ద్యావనపల్లి సత్యనారాయణగుండాలకు వెళ్లటం ఒక సాహసం. ఇది ఎతె్తైన సత్మల పర్వత సానువులను ఎక్కాక నట్టనడిమి అడవిలో ఉంది. ఇక్కడికి రోడ్లుండవు. కాలినడకే శరణ్యం. కవ్వాల అభయారణ్యంలో భాగమైన ఈ గుండాలకు అటవీ మార్గంలో ఎలా పోవాలో కూడా తెలియదు కాబట్టి గుండాల మాజీ ఎపీటీసీ మోతేరామ్ పటేల్‌ను, సమీప హామ్లెట్ మాజీ ఉపసర్పంచ్ నర్సయ్య పటేల్‌ను తీసుకెళ్లాం.

9440687250
No comments:
Post a Comment