విస్మృత క్షేత్రంలో విస్మృత పర్యటన
తెలుగు దేశంలో మధ్య యుగాలలో మహోన్నత
స్థితిని అనుభవించిన క్షేత్రాలు ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతు న్నారుు.
అలాంటి క్షేత్రాల్లో ముందుగా చెప్పుకోదగినది శ్రీశైల క్షేత్రం గురించి . ఈ
క్షేత్రం గురించే తెలుగులో మెుట్టమెుదటి క్షేత్ర మహత్మ్య కావ్యం వచ్చింది.
అది పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణం. ఇది
సుమారు క్రీ.శ.1290 ప్రాంతంలో రచించబడింది. ఇందులో శ్రీపర్వత (శ్రీశైల)
క్షేత్ర దర్శనం శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామ హాశ్వరం నుంచి
ప్రారంభమౌతుంది. ఈ పర్యటనలో పండితారాద్యుని శిష్యూడు దోనమ రాజయ్య
మెుట్టమెుదట చూసింది శ్రీకుచేశ్వర, సిద్ధేశ్వర తదితర లింగాల యాలను. వాటిని
చూడటానికి నేను, నా మిత్రుడు రామారావు, అతని తమ్ముడు లక్ష్మణ్ ఆ విస్మృత
క్షేత్రంలో పర్యటన చేసి చివరికి చూడగలిగాము.
మరపురాని సాహసయాత్ర...మనం
ప్రయాణిస్తున్న వాహనం నల్లమల కొండను సగం ఎక్కి మూలమలుపు తిరిగి దక్షిణం
శ్రీశైలం వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుడివైపు చూస్తే ఆ కొండల నుండి కింది
వైపు కొనసాగుతున్న ఒక రాతి కోటగోడ పచ్చని అడవుల మధ్య పాపిట లాగ తెల్లని
రేఖలా అందంగా కనిపిస్తుంది. పర్వత ప్రకరనం ప్రకారం మేము కనుక్కోదలుచుకున్న
ఆలయాలు ఆ కోట ప్రాంతంలో ఉంటాయనుకొని కల్చే మలపు దగ్గర ప్రారంభమౌతున్న
కోటగొడను ఎక్కి దాని మీదనే పడమటి వైపు ఫర్లాంగు దూరం నడిచాము. ఆ గోడ ఎత్తు,
వెడల్పులు సుమారు నాలుగేసి మీటర్లుంటాయి. అత్యంత పురాతనంగా కనిపిస్తున్న ఆ
రాతి కోటగోడను ఎవరు ఎప్పుడూ కట్టించారో ఇప్పటివరకూ చరిత్రలో ఆనవాళ్లు
లేవు.
దట్టమైన అడవి కావడంతో గోడ కూడా అందులో చిక్కుకుపోయింది.
ఆగోడపై చేసే ట్రెక్కింగ్ ఒక సాహస చర్య మాత్రమే కాదు, జీవితంలో ఎప్పట్టికీ
గుర్తుండి పోయే ఒక మధురానుభూతి. ఆ గోడపై నుంచి ఎటు చూసినా చుట్టూ ఎతె్తైన
కొండలు, పచ్చని అడవులే దర్శనమిస్తాయి. ఆ అడవులు, చెట్ల నుంచి వచ్చే గాలి
స్వచ్ఛమైనదే కాదు చల్లనైననది కూడా. ఆగాలి మనకిచ్చే హాయిని అనుభవిస్తేనే
తెలుస్తుంది ఆ ఆనందమేమిటో. చెట్లు, వృక్షాలు ఎన్నెన్ని ఆకృతులను ఆశ్రయి
స్తాయో చూసి వాటినెక్కి ఆనందించాల్సిందే.

రాతి
గోడ రెండువె ైపులా విస్తరించడాన్ని పరిశీలిస్తే అది ప్రాచీ న కాలంలో ఒక
గ్రా మాన్నో, పట్టణాన్నో చు ట్టూ కట్టబడింది అని అర్థ మైంది. ఆ కోట గోడ
మధ్య నున్న పల్లపు ప్రాంతంలో కుం డ పెంకులు, ఇళ్ళ అడుగులు, నివాస యోగ్యమైన
పరుపు బండలు, కొలను ఆనవాళ్ళు, ఉత్తరం వైపు పారుతు న్న వాగు కుడి ఒడ్డున
కోనేరు కనిపించాయి. ఇక్క ఒక కొలనును స్థానికులు పరుమాళ్ళు కొలను అని
పిలుస్తారు. శ్రీశైలం ప్రాచీన చరిత్రను అధ్యయనం చేస్తునప్పుడు మనకు పరమార
అనే వం శం ఈ ప్రాంతానిన కీ.శ. 6వ శతాబ్దంలో పరిపాలించినట్టు తెలుస్తుంది. ఈ
పరమాల లేదా ప్రమర అనే వంశం భ్రమర అనే పదం సంబంధితం అని భ్రమర (తుమ్మెద)
మామిడి ఉమామహేశ్వర ఆలయ ఆవరణలో మూడు దశాబ్దాల క్రి తం వరకూ ఉన్నది కాబట్టి ఈ
వంశంవారు ఇక్కడి ప్రాంతీయులే అని చెప్ప వచ్చు.
ఈ ప్రాంతాన్ని
పాలించిన విష్ణుకుండల తరువాత పరిపాలనలోకి వచ్చిన ప్రమర వంశంలోని 5వ తరం
రాజు చంద్రగుప్తుడు (గంధర్వసేనుడు). ఇతని కొడుకు శంఖుని పేర దగ్గర్లోని
సలేశ్వరంలోని జలపాతాల్లో ఒకదానికి శంఖుతీర్థ అని పేరుంది. శంఖుని పేర
దగ్గర్లోని సలేశ్వరం లోని జలపాతాల్లో ఒకదానికి శంఖు తీర్థం అని పేరుంది.
రెండవ కొడుకు విక్రమాదిత్యుడు కీ.శ. 565లో ఉజ్జైనికి రాయ్యా డని స్కాంద
పురాణాంతర్గత శ్రీశైలఖండం చెప్తుంది. 14వ శతాబ్దానికి చెందిన జక్కన
‘విక్రమార్క చరిత్ర’ కూడా ఈ విషయాన్ని వివరిస్తుం ది. విక్రమార్కుని
చెల్లి... అనగా చంద్రగుప్తుని కూతురు చంద్రవతి ఈ ప్రాంతం లో ఆలయాలను
కట్టించింది. కాబట్టి ఆమె పేరుతో ఈ ప్రాంతంలో చాలా ప్రదే శాలు కన్పిస్తాయి.

అవి...
చంద్రపూర్, చంద్రవాగు, చంద్రసాగర్ (చెరువు), చం ద్రబండ (గుట్ట),
చంద్రధార (చిన్న జలపాతం, ఉమామహేశ్వరం), చంద్రప్రభ పట్టణం. చంద్రవతి భోగవతీ
పురాధీశ్వరుడైన రూపవర్మను వివాహమాడిందని భవిష్యపురాణం చెప్తుంది.
ఉమామహేశ్వరం దిగువ భాగమే భోగవతీపురం. దా న్నిప్పుడు భోగమహేశ్వరం
అంటున్నారు. చంద్రవతి మల్లెమాలలచే పూజించిన మద్ది (అర్జున) లింగమే శ్రీశైల
మల్లికార్జునుడ య్యాడు. ఆ లింగం ఇప్పుడు వృద్ధ మల్లికార్జునలింగంగా శ్రీశైల
దేవాలయ ఈశాన్య ఆలయంలో పూజలందుకుం టున్నది. పరుమాళ్ళ కొలను పరిసర పురావస్తు
ఆధారాలు కూడా క్రీ.శ. 6వ శ తాబ్దం నాటి ప్రాచీనతను తెలుపుతున్నాయి. ఈ
కొలను మీదనే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు పెద్ద బావి కట్టారు. అయినా ఆ
కోనేరు మెట్లు ఇంకా బయటికి కని పిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతం నీటి వనరులతో,
ఏపుగా పచ్చగా పెరిగిన చెట్టు చేమలతో చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంది.
ఇది
తెలిసిన కొద్ది మంది పర్యాటకులు ఇక్కడికి పిక్నిక్‌కు వస్తుంటారట.
పరుమాళ్ళ దేవర కొలను చుట్టూ నలు దిక్కులా కిలోమీటరు చొప్పున అడవిలో
అణువణువూ గాలించాము. అయినా మాకు గుప్తమహేశ్వరం కన్పించలేదు... ఒక్క
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వా రి ఔట్‌పోస్ట్ తప్ప. మధ్యాహ్నం మూడయ్యింది.
లోపల ఆకలి దంచుతోంది. పైన ఎండ దంచుతోంది. చెట్ల నీడల్లో తిరుగుతున్నాం
కాబట్టి బతికిపోయాం. అయినా అలసిపోయాం. ఇక్కడికి రెండు కిలో మీటర్ల దూరంలో
ఉన్న ఓంకార పిరమిడ్ ధ్యానాశ్రమానికి వెళ్ళి నిర్వాహకులు ప్రేమతో పెట్టిన
ఉచిత భోజనం బొజ్జ నిండా తిన్నాం. తరువాత రామారావు పని ఉన్నదని తన తమ్ముడు
లక్ష్మణ్‌ను కూడా పిలిపించాడు.
ఇక మేము గుప్త మహేశ్వరాలయం కోసం దట్టమైన చెట్ల పొదలను వెదుకదల్చుకున్నాం.
కాని మనుషులు దూరలేని పొదల్లోనే మధ్యాహ్నమం తా జంతువులు బస చేస్తాయి
కాబట్టి మాకు ప్రమాదం ఎదురైతే ఎదుర్కొవడానికని లక్ష్మణ్ స్థానిక గిరిజనుని
గుడిసెలో నుండి ఒక గొడ్డలి తీసుకొచ్చాడు. గొడ్డలిని చూసి మమ్మల్ని
వేటగాళ్ళో, కలప దొంగలో అనుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇద్దరు
వాచ్‌మెన్లు పట్టుకున్నారు. విషయం చెప్పినా గుర్తింపు కార్డు చూపించాక
సమాధానపడ్డారు. ఒక వాచ్ మెన్ దామా నాయక్ మాకు గుప్తమహేశ్వరాన్ని
చూపించడానికి ఉత్సాహం చూపించాడు. దేవుడు మా శ్రమను చూడలేక దామా నాయక్
రూపంలో వచ్చాడనుకున్నాం.
దామా నాయక్ మొదట మాకు ఒక షెడ్ చూపించి
ఇందులో లింగ ముంది అన్నాడు. ఆ షెడ్‌ను ఇంతకు ముందు మేము ఫారెస్ట్
ఔట్‌పోస్ట్ అనుకున్నాం. ‘ఇదేంటి ఇంత కొత్త షెడ్డు ప్రాచీనాలయం
ఎట్లవుతుంది?’ అనడిగితే అతి కష్టమ్మీద పొదల్లో నుంచి మమ్మల్ని ఆ ఆలయంలోకి
తీసుకెళ్లూ, ‘1975లో ఒక రేంజ్ ఆఫీసర్ ఇక్కడ శిథిలమై ఉన్న ఇటుక ఆలయాన్ని
చూసి శిథిలాలను అటూ-ఇటూ తన్నుతూ శివలింగాన్ని కూడా తన్నగా అది
విరిగిపోయింది. తరువాత మనశ్శాంతి లేక తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తంగా ఈ
షెడ్‌ను కట్టించాడు’ అని చెప్పాడు. చాలా చోట్ల ఉత్తరాభి ముఖంగా ఉండే
పానవట్టం ఇక్కడ తూర్పుకభిముఖంగా ఉంది. చతురస్రాకారంలో ఉన్న ఆ పానవట్టంలో
ఫీట్ ఎత్తు లింగముంది. దానికి ఊర్ధ్వపుండ్రాలున్నాయి.
ఇదే
సిద్ధేశ్వరలింగమై ఉంటుంది. ఎందుకంటే, సుమారు అర్థ శతాబ్దం కింద ఇక్కడ రోడ్
వేస్తున్న ప్పుడు దొరికిన ‘సిద్ధుల’ విగ్రహాలను ‘మూలమలుపు’ దగ్గర
పోగేశారు. సిద్ధు లు స్థాపించిన అరుదైన మరకత లింగం (చిగురుపచ్చనిది) రెండు
సంవత్స రాల క్రితం వరకు కూడా అక్కడే ఉండేది. ఇప్పుడు కొన్ని సిద్ధుల
విగ్రహాలు సమీప మన్ననూరు తూర్పున ఒక వేప చెట్టు కింద ఉన్నాయి.
ధనం బండ - కుబేరేవ్వరాలయం...
ఇక్కడ్నుంచి దామా నాయక్ మమ్మల్ని ధనంబండగా పిలుస్తున్న పెద్ద పరుపు బండ
వద్దకు తీసుకెళ్ళాడు. ఆ బండ తూర్పు కొసన కుబేరుని శిల్పం చెక్కి ఉం ది.
దీనికి ఉత్తరాన శిథిలమై పోయిన ఇటుకల కుబేరేశ్వరాలయముంది. కుబే రుడు ధనానికి
ప్రతీక కాబట్టి ఆ ఆశతో ప్రబుద్ధులు ఈ ప్రాంతంలో విపరీతం గా తవ్వకాలు
జరుపడంతో ఇక్కడి ఆలయాల రూపురేఖలు కూడా కనుమరు గైపోతున్నాయి. హద్దులు లేని
అత్యాశ, అజ్ఞానాలకు ఆలయాలకు ఆలయాలే బలికావడం చూసి బాధపడ్డాం. ‘శ్రీశైల
ఖండం’ ఇక్కడి ఉమామహేశ్వర ప్రాం తం కుబేర స్థలమని, అతని పట్టణం పేరు మొదట
మణిగిరి అని, తరువాత దాని పేరు ‘చంద్ర ప్రభ పట్టణం’గా మారిందని
తెలియజేస్తుంది.
గుంటూరు జిల్లా భట్టిప్రోలు శాసన ఫలకాల మీదున్న
కుబేరుని పేరుని బట్టి, ఆదిలాబాద్ జిల్లాలో కుబేరుని పేరు మీదున్న కుబీర్
పట్టణంలో కన్పించే పురావస్తు ఆధారా లను బట్టి కుబేరుడనే రాజు తెలుగు
దేశాన్ని క్రీ.పూ. 4వ శతాబ్దం ప్రాంతంలో పరిపాలించాడని తెలుస్తున్నది.
అప్పటి మణిగిరి పట్టణం క్రీ.శ. 4వ శతాబ్దం నుండి ‘చంద్రప్రభ పట్టణం’గా
మారిందని చంద్రగుప్తుని కూతురు చంద్రవతి గాథ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో
ఇక్కడి ఆలయాలు తొలితరంలో రూపు దిద్దుకొని ఇప్పటికీ శిథిలమాత్రంగానైనా
నిలిచి ఉన్నాయని చెప్పవచ్చు.
గుప్తమహేశ్వరం...‘పర్వత
ప్రకరణం’లో దోనమయ్యకు సర్వజ్ఞ మల్లికార్జునుడు వృద్ధ తపస్వి రూపంలో కనబడి
ఉమామహేశ్వరానికి ‘తూర్పున చూడు సంస్తుత్యమై గుప్తమహేశ్వరం బొప్పు మహిత
తల్లింగ మహాత్మ్యమది అవాఙ్మరసాత్మకమ్ము’ అంటూ గుప్త మహేశ్వరాన్ని చూపించి, ఆ
లింగం వాక్కు, మనసు, ఆత్మలను ఆనందింపజేసే మహత్మ్యం కలదని
వివరించినట్లుంది. దురదృష్టవశాత్తు ఆ లింగం ఇప్పుడు లేదు. ధనం కోసం దాన్ని
పెకిలించి దాని కింద తవ్వారు. ఆ దొంగల తవ్వకాల్లో ఆ లింగం ధ్వంజమై ఉంటుంది.
లేదా ఆ లింగాన్నే ఎక్కడి కో తీసుకెళ్ళి అమ్ముకుని ఉంటారు. అర్థ మంటపం,
అంతరాళం, గర్భగృహా లతో శిలా నిర్మితమైన ఈ ఆలయం మాత్రం తన అత్యంత ప్రాచీన
వైభవాన్ని ప్రదర్శిస్తున్నది. అంతరాళం ద్వారం పై కడపకు లక్ష్మీదేవి విగ్రహం
చెక్కి ఉంది.

ఈ
ఆలయం ఎదురుగా పడమరన యాభై ఫీట్ల దూరంలో అత్యంత అరుదైన నంది విగ్రహముంది. ఒక
ఫీటు ఎత్తు, రెండు ఫీట్ల పొడవు దాని కొలతలు. దాన్ని అరుదైన మెత్తటి రాయి
నుండి గాని, సున్నపు గారతో గాని శిల్పించారని అన్పిస్తుంది. ఇలాంటి నంది
విగ్రహమొకటి గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో ఉంది. అది క్రీ.శ.
2-4వ శతాబ్దాల నాటిదని పురావస్తు నిపుణుడు ఐ.కె.శర్మ నిర్ధారించారు. ఈ
నేపథ్యంలో గుప్త మహేశ్వర నంది కూడా 1600 సంవత్సరాల కిందటిదని
నిర్ధారించవచ్చు. మొదట ఈ నంది ఆలయ అంతరాళంలో ఉండేదన్నట్లుగా అర్థమవుతుంది.
కొద్ది శ్రమ, కొంచెం ఖర్చుతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించ వచ్చు. అలా చేస్తే
పర్యాటకులకు, భక్తులకు పచ్చని అడవులు, కొండలు, సెలయేళ్ళ మధ్య ఆనం దించే
అరుదైన అవకాశం దక్కుతుంది.
‘శ్రీశైల ఖండం’ ఇక్కడి ఉమామహేశ్వర
ప్రాంతం కుబేర స్థలమని, అతని పట్టణం పేరు మొదట మణిగిరి అని, తరువాత దాని
పేరు ‘చంద్ర ప్రభ పట్టణం’గా మారిందని తెలియజేస్తుంది. గుంటూరు జిల్లా
భట్టిప్రోలు శాసన ఫలకాల మీదున్న కుబేరుని పేరుని బట్టి, ఆదిలాబాద్
జిల్లాలో కుబేరుని పేరు మీదున్న కుబీర్ పట్టణంలో కన్పించే పురావస్తు
ఆధారాలను బట్టి కుబేరుడనే రాజు తెలుగు దేశాన్ని క్రీ.పూ. 4వ శతాబ్దం
ప్రాంతంలో పరిపాలించాడని తెలుస్తున్నది. పరుమాళ్ళ కొలను పరిసర పురావస్తు
ఆధారాలు కూడా క్రీ.శ. 6వ శతాబ్దం నాటి ప్రాచీనతను తెలుపుతున్నా యి. ఈ కొలను
మీదనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు పెద్ద బావి కట్టారు. ఆ కోనేరు
మెట్లు ఇంకా బయటికి కనిపిస్తూనే ఉన్నాయి.
- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
తెలుగు యూనివర్శిటీ ఆడిటర్, సెల్: 9440687250